Begin typing your search above and press return to search.

రాజ్యసభ రేసులో మీడియా గుర్రాలు

By:  Tupaki Desk   |   17 April 2016 12:21 PM IST
రాజ్యసభ రేసులో మీడియా గుర్రాలు
X
ఏపీలో రాజ్యసభ సీట్లపై ఆశ పడనివాడే పాపాత్ముడు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ప్రభుత్వాధినేతలకు అండగా ఉంటూ... వారు కోరుకున్నట్లుగా వార్తలు వండివార్చే మీడియా అధినేతలు రాజ్యసభ సీటుపై మోజు పడుతున్నారు. ఎలాగైనా సాధించాలని గురిపెడుతున్నారు. దీనికోసం నేరుగా చంద్రబాబుపైనే ఒత్తిడి తెస్తున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి పదవీకాలం పూర్తి కానుండడం.. ఆయన్ను మళ్లీ పొడిగించే అవకాశం లేకపోవడంతో ఆ ప్లేసు కోసం గట్టి పోటీ కనిపిస్తోంది.

టీవీ ఛానళ్లు - పత్రికలు ఉన్నవారంతా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నది కాదనలేని సత్యం. టీడీపీ అనుకూలంగా ఉండే మీడియా నుంచి ఇప్పుడు ముగ్గురు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. అందులో ఇద్దరు మీడియా గ్రూపుల అధినేతలు కాగా ఒకరు మీడియా గ్రూపు అధినేతకు సమీప బంధువు.

ఇద్దరు మీడియా అధినేతలతో పాటు రామోజీరావు వియ్యంకుడి కోసం కూడా రాజ్యసభ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వినికిడి. అయితే... ఈ రేసులో ఎవరికి ఛాన్సు దొరుకుతుందో చూడాలి.