Begin typing your search above and press return to search.

మీడియా ముందుకు కేసీఆర్.. అందరిలోనూ ఆసక్తి

By:  Tupaki Desk   |   24 Oct 2019 9:25 AM GMT
మీడియా ముందుకు కేసీఆర్.. అందరిలోనూ ఆసక్తి
X
తెలంగాణలో పరిస్థితి మొత్తం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉంది. ఓవైపు ఆర్టీసీ సమ్మె.. దాన్ని బేస్ చేసుకొని రెచ్చిపోతున్న ప్రతిపక్షాలు.. రెచ్చగొడుతున్న కేంద్రంలోని బీజేపీ.. ఇక ప్రజాసంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేసీఆర్ సర్కారుపై పోరుకు రెడీ అవుతున్న సందర్భం ఇదీ..

ఇంటా బయటా ఎంతో రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కొండంత ఊరట లభించింది. హుజూర్ నగర్ గెలుపు తెచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు..

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ఎదురుగాలి తప్పదని అంతా భావించారు. ఆర్టీసీ సమ్మె దాని పర్యవసనంగా తలెత్తిన వివాదాలు అన్నీ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాయి. దీంతో కేసీఆర్ పార్టీ ఓటమి ఖాయమని అనుకున్నారంతా..

అయితే అనూహ్యంగా కేసీఆర్ ప్రచారానికి వెళ్లకున్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా జరిగినా హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ గెలిచింది.. తెలంగాణలో నిలిచింది. ఈ పరిణామం కేసీఆర్ , టీఆర్ఎస్ లో కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది..

ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజులకు కేసీఆర్ మీడియా ముందుకు వస్తున్నారు. ఆర్టీసీ సమ్మె సహా ప్రతిపక్షాల ఆట.. కేంద్రంలోని బీజేపీ చేసిన ఒత్తిడి ఇలా అన్నింటిపై కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.