Begin typing your search above and press return to search.

ఐపీఎల్ పై ‘నిషేధం’.. ప్ర‌క‌టించిన మీడియా సంస్థ‌!

By:  Tupaki Desk   |   26 April 2021 12:30 AM GMT
ఐపీఎల్ పై ‘నిషేధం’.. ప్ర‌క‌టించిన మీడియా సంస్థ‌!
X
దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,53,569 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,46,787 మందికి పాజిటివ్ అని తేలింది. వ‌రుస‌గా నాలుగో రోజు కేసుల సంఖ్య 3 ల‌క్షలు దాటిపోయింది. దీంతో.. ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అటు ప్ర‌భుత్వాలు వైర‌స్ నియంత్ర‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో అర్థం కాక త‌ల‌పట్టుకుంటున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్న ఈ సంద‌ర్భంలో ఐపీఎల్ వార్త‌ల‌ను ప్ర‌చురించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది. క‌రోనా విల‌య‌తాండం చేస్తున్న త‌రుణంలో ఇలాంటి వార్త‌లు ప్ర‌చురించ‌డం స‌రికాద‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపింది.

ఈ క‌ఠిన ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కూ క్రికెట్‌, ఐపీఎల్ కు సంబంధించిన వార్త‌ల‌ను త‌మ ప‌త్రిక‌లో ప్ర‌చురించ‌బోమ‌ని తెలిపింది. ఇలాంటి కండీష‌న్లో అంద‌రం క‌లిసిక‌ట్టుగా క‌రోనాపై యుద్దం చేయాల్సి ఉంద‌ని పేర్కొంది. ఈ విష‌యాన్ని పాఠ‌కులు అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నామ‌ని తెలిపింది ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్‌.