Begin typing your search above and press return to search.

కోదండ‌రాంకు జాతీయ స్థాయి మ‌ద్దతు!

By:  Tupaki Desk   |   9 April 2017 9:40 AM GMT
కోదండ‌రాంకు జాతీయ స్థాయి మ‌ద్దతు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న‌పై క‌త్తులు నూరుతున్న తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొత్త మిత్రులు ద‌రిచేరుతున్నారా? మాష్టారు త‌న ప‌రిధిని విస్త‌రించుకుంటూ ముందుకు సాగడంలో భాగంగా తెలంగాణ‌లోని స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తపై గ‌ళం విప్పుతూనే జాతీయ స్థాయిలో తన పోరాటానికి సంఘీభావం పెంచుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా ప్ర‌ముఖ సామాజిక ఉద్య‌మ‌కారిణి మేథా పాట్కర్ హైద‌రాబాద్‌ కు ప్ర‌త్యేకంగా వ‌చ్చి కోదండ‌రాం నివాసంలో ఆయ‌న‌తో స‌మావేశం అయ్యారు. కోదండ‌రాం త‌ల‌పెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వం అనుసరించిన నిర్బంధ వైఖరిని ఖండించారు. టీజేఏసీ ఉద్య‌మాల‌కు సంఘీభావం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మేథా పాట్కర్ స్పందిస్తూ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చట్ట వ్యతిరేకంగా ప్రజలనుండి బలవంతపు భూసేకరణను ఖండించారు. ప్రజలు కేంద్రంగా కలిగిన అభివృద్ధి కోసం ఐక్యంగా జాతీయ స్థాయిలో పనిచేయడం అవసరమని మేథా పాట్కర్ అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలతో ఐక్యతను సాధించడం కోసం తెలంగాణలో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మేథా పాట్కర్ తెలిపారు. త‌ద్వారా త‌మ పోరాటంలో కోదండ‌రాంకు కీల‌క స్థానం ఉంటుంద‌ని ప‌రోక్షంగా చెప్పారు.

కాగా, నిరుద్యోగ ర్యాలీని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌గ్నం చేసిన అనంతరం లోక్‌పాల్ ఉద్య‌మ‌కారుడు అన్నా హ‌జారే మాజీ అనుచ‌ర‌గ‌ణం, ఢిల్లీ వేదిక‌గా పోరాటం సాగిస్తున్న స్వ‌రాజ్ అభియాన్ పార్టీ నేత‌లు త‌మ సంఘీభావం తెలిపారు. జేఏసీ కార్య‌క్ర‌మాల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా జాతీయ స్థాయిలో ప్ర‌ముఖ ఉద్య‌మ‌కారిణిగా పేరొందిన మేథా పాట్క‌ర్ జ‌ట్టుక‌ట్టారు. ఈ నేప‌థ్యంలో కోదండ‌రాం త‌న పోరాట పంథాను మ‌రింత విస్తృత ప‌రుస్తున్నార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/