Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ కు అదిరే కౌంటర్ ఇచ్చిన మెక్ డొనాల్డ్

By:  Tupaki Desk   |   27 Jan 2022 4:02 AM GMT
ఎలన్ మస్క్ కు అదిరే కౌంటర్ ఇచ్చిన మెక్ డొనాల్డ్
X
తెలివి ఏ ఒక్కడి సొంతం కాదు. ఆ విషయాన్ని మర్చిపోతే అనవసర షాకులు గ్యారెంటీ. కెలికి మరీ కొట్టించుకోవటం కొందరికి అలవాటు. ఇప్పుడు అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మాస్క్. అతగాడి సరదా మాటలకు.. మళ్లీ నోటి వెంట మాట రాని రీతిలో పంచ్ ఇచ్చిన మెక్‌డొనాల్డ్‌ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

ప్రపంచ కుబేరుడిగా తనకున్న ఇమేజ్ కు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించే ఎలన్ మస్క్ అప్పుడప్పుడు ఎటకారంగా మాట్లాడేస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో అతని ప్రతిభ.. అతన్ని ప్రపంచ కుబేరుడిగా చేసింది. అయినప్పటికీ అతడిలోని వంకర మాటల కారణంగా అప్పుడప్పుడు అభాసుపాలవుతుంటారు. టెస్లా కార్లతోనే కాదు.. క్రిప్టో కరెన్సీ విషయంలో కూడా ఆయనకు మంచి పేరుంది. అతడికి చెందిన డోజ్ కాయిన్ ను తరచూ ప్రమోట్ చేస్తుంటాడు.

తమ డోజో క్రిప్టో కరెన్సీని తమ టెస్లా కార్లను కొనే వేళలో ఇస్తే తాము తీసుకుంటామన్న ఆయన మాటలు.. ఈ క్రిప్టో కరెన్సీ మరింత పాపులర్ కావటానికి దోహదపడేలా చేసింది. ఈ క్రిప్టో కరెన్సీలో ఎలన్ మాస్క్ భారీగా పెట్టుబడులు పెట్టటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తన నోటిని అదుపులో ఉంచుకోని ఎలన్ మాస్క్.. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన ఫుడ్ సప్లై చెయిన్ మెక్‌డొనాల్డ్‌ తో పెట్టుకున్నారు.

తన డోజ్ క్రిప్టో కరెన్సీని మెక్‌డొనాల్డ్‌ అంగీకరిస్తే.. తానెంతో ఆనందంతో ఆ ఫుడ్ ను తింటానని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్వీట్ కు.. కాస్త ఆలస్యంగా అయినా అదిరేత పంచ్ ఇచ్చింది మెక్‌డొనాల్డ్‌. ఎలన్ మాస్క్ మాదిరే.. మెక్‌డొనాల్డ్‌ సైతం ఒక డమ్మీ బిట్ కాయిన్ ను తయారు చేసింది. దానికి గ్రిమాకే కాయిన్ అంటూ పేరు పెట్టింది. దాన్ని సోషల్ మీడియాలో జత చేసి.. ‘‘మీ డోజ్ కాయిన్ ను మెక్‌డొనాల్డ్‌ లో అంగీకరిస్తాం. కానీ ఒక షరతు.

టెస్లా కారును కొనేప్పుడు మీరు గ్రిమాకే కాయిన్స్ ను తీసుకోవాలి’’ అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో టెస్లా అధినేతకు తిక్క కుదిరేలా మెక్‌డొనాల్డ్‌ ఇచ్చిన సమాధానం బాగుందంటూ నెటిజన్లు పాజిటివ్ గా రియాక్టు అవుతున్నారు. మెక్‌డొనాల్డ్‌ ను ముగ్గులోకి లాగి.. తన క్రిప్టో కరెన్సీని ఫేమస్ చేసుకోవాలని ఎలన్ మాస్కు భావిస్తే.. సదరు సంస్థ అతనికి అదిరే ఎటకారపు పంచ్ ఇచ్చిందని చెప్పక తప్పదు.