Begin typing your search above and press return to search.

ట్రంప్ వేస్ట్ అంటున్న మెక్ డొనాల్డ్స్

By:  Tupaki Desk   |   18 March 2017 4:52 AM GMT
ట్రంప్ వేస్ట్ అంటున్న మెక్ డొనాల్డ్స్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై ప్రముఖ ఫాస్ట్‌ ఫుడ్ సంస్థ‌ మెక్‌ డొనాల్డ్స్‌ చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ట్రంప్‌ విశాల హృదయుడు కాదని పేర్కొంటూ ఆయ‌న అధ్యక్ష పదవికి పనికిరాడని, తమకు తిరిగి బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా కావాలంటూ ట్వీట్‌ చేసింది. ఇది మెక్‌ డొనాల్డ్స్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి పోస్ట్ అవ‌డంతో వైరల్‌ గా మారింది. ఈ ట్వీట్‌ పోస్ట్‌ అయిన కాసేపట్లోనే లక్షలాది మంది షేరింగ్‌ చేశారు. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. వెంటనే స్పందించిన మెక్‌ డొనాల్డ్స్‌ తమ ట్విట్టర్‌ ఖాతా నుంచి ఈ ట్వీట్‌ ను తీసేసింది.

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో మెక్ డొనాల్డ్స్ క్ష‌మాప‌ణ‌లు చెప్తూ క్లారిటీ ఇచ్చింది. తమ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్‌ అయి ఉంటుందని అందుకే ఇలాంటి ట్వీట్‌ వచ్చిందని మెక్‌డొనాల్డ్స్‌ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఇలా జరిగినందుకు క్షమాపణలు చెప్పింది. ఖాతా హ్యాక్‌ అయినట్టు ట్విటర్‌ తెలిపిందని పేర్కొంది. దీనిపై కంపెనీ విచారణ జరుపుతోందని మెక్ డొనాల్డ్స్‌ వెల్లడించింది. అయితే అప్పటికే చాలా మంది దాన్ని ఆన్‌లైన్‌ వేదికగా ఇతరులతో పంచుకోవడంతో వైరల్‌ గా మారింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/