Begin typing your search above and press return to search.

సిక్సర్ల సునామీకి వేదిక మారిందంతే..

By:  Tupaki Desk   |   12 April 2015 6:32 AM GMT
సిక్సర్ల సునామీకి వేదిక మారిందంతే..
X
ఒకవైపు మెక్‌ కల్లమ్‌, మరోవైపు క్రిస్‌గేల్‌... మొన్నటి వరకూ ప్రపంచకప్‌లో వీరి మెరుపులు కనిపించాయి. ఇప్పుడు ఆ సునామీ వేదికను మార్చుకొని ఇండియా తీరాన్ని తాకింది. ఐపీఎల్‌లో గర్జిస్తోంది! పరుగుల వర్షం కురుస్తోంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరపున మెక్‌ కల్లమ్‌, కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున క్రిస్‌గేల్‌ పరుగుల వర్షాన్ని కురిపించారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. అభిమానులను అమితంగా ఆనందపెట్టారు.

మెక్‌కల్లమ్‌ 56 బంతులకే సెంచరీ చేసేయగా.. క్రిస్‌గేల్‌ ఇన్నే బంతుల్లో 96 పరుగులకు రన్‌ఔట్‌ అయ్యి సెంచరీని చేజార్చుకొన్నాడు. దీంతో ఈ ఆటగాళ్లు తమ తమ స్వదేశీటీమ్‌ల తరపున ప్రపంచకప్‌లో కనబరిచిన ధాటినే ఐపీఎల్‌లో కూడా కనబరుస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది.

మెక్‌కల్లమ్‌ ఇన్నింగ్స్‌తో డీసీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై టీమ్‌ భారీ స్కోరును సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి హైదరాబాద్‌ టీమ్‌ పై తీవ్రమైన ఒత్తిడిని పెట్టింది. లక్ష్య చేధనలో చెన్నై టీమ్‌తో పోటీ పడలేక హైదరాబాద్‌ టీమ్‌ ఓటమి పాలయ్యింది.

ఇక గేల్‌రెచ్చిపోయిన మ్యాచ్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా పర్వాలేదనిపించుకొనే స్కోరును చేసినా.. గేల్‌ ధాటి ముందు ఆ స్కోరు చిన్నబోయింది. గేల్‌ విరుచుకుపడటంతో లక్ష్య చేధనలో బెంగళూరు విజయవంతం అయ్యింది.

ఈ విధంగా ఈ ఇద్దరి ప్లేయర్ల ఇన్నింగ్సులు వీకెండ్‌లో ఫుల్‌ వినోదాన్ని అందించాయి. అయితే ఇది ఇంకా ఆరంభం మాత్రమే.. రానున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ఈ ఆటగాళ్ల ధాటి ఇంకా ఎంతలా కొనసాగుతుందో చూడాలి!