Begin typing your search above and press return to search.

మేయర్ కి వైరస్ పరీక్ష ..రిపోర్ట్ లో ఏం తేలిందంటే ?

By:  Tupaki Desk   |   8 Jun 2020 6:30 AM GMT
మేయర్ కి వైరస్ పరీక్ష ..రిపోర్ట్ లో ఏం తేలిందంటే ?
X
తెలంగాణలో రోజురోజుకి వైరస్ వేగంగా విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో మేయర్ బొంతు రామ్మోహన్ వైరస్ నిర్దారణ టెస్ట్ చేయించుకున్నారు. రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది నిర్వహించిన పరీక్షల్లో మేయర్ కి వైరస్ ఫలితం నెగెటివ్ ‌గా వచ్చింది. నగరంలో జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణలో భాగంగా నిరంతరం పర్యటిస్తున్న మేయర్‌ ఇటీవల స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక హోటల్‌ లో టీ తాగరు. ఆ హోటల్‌లో అప్పుడు టీ పంపిణీ చేసినట్లుగా పేర్కొంటున్న వ్యక్తి, అప్పటికి పది రోజుల ముందు నుంచే విధులకు హాజరు కాలేదు. అనంతరం టెస్టుల్లో హోటల్ ‌లోని వ్యక్తికి పాజిటివ్ ‌గా నిర్ధారణ అయ్యింది.

ఈ నేపథ్యంలో వారికీ వైరస్‌ సోకిందేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్నేహితులు, వైద్యుల సూచన మేరకు ముందు జాగ్రత్తగా మేయర్ బొంతు రామ్మోహన్ పరీక్షలు చేయించుకున్నారు. మేయర్ ‌కు వైరస్‌ సోకలేదని వైద్యులు నిర్ధారించారని జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌ ఓ యాస వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్‌ డ్రైవ్‌లో మేయర్‌ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీన రామ్మోహన్‌ రాంనగర్‌ లోని అడిక్ ‌మెట్‌ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చెత్తా చెదారం తొలగించిన అనంతరం అక్కడి షణ్ముఖ హోటల్‌ లో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి చాయ్‌ తాగారు. అదే హోటల్‌ లో పనిచేసే ఓ వ్యక్తికి మేయర్‌ చాయ్‌ తాగిన మరునాడే కరోనా పాజిటీవ్‌గా తేలింది. ఈ క్రమంలో హోటల్ ‌లో చాయ్‌ తాగిన విషయం ప్రస్తావనకు రావడం, అందరూ అనుమానం వ్యక్తం చేస్తుండడంతో అపోహలు తొలగించేందుకు ఈ నెల 5వ తేదీన ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మేయర్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.