Begin typing your search above and press return to search.

మాయావతి సంగతి ఫైనల్ అయిపోయిందా ?

By:  Tupaki Desk   |   12 Jan 2022 8:30 AM GMT
మాయావతి సంగతి ఫైనల్ అయిపోయిందా ?
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇంత కాలం అయోమయంలో ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి విషయంలో క్లారిటి వచ్చేసినట్లేనా ? రాబోయే ఎన్నికల్లో తమ అధినేత్రి మాయావతి పోటీ చేయటం లేదని పార్టీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా ప్రకటించారు. హఠాత్తుగా పోటీ చేయకూడదని మాయావతి ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే విషయం పార్టీ నేతలనే అయోమయానికి గురిచేస్తొంది.

ఇంతకాలం ఏమీ మాట్లాడని అధినేత్రి ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ వేడి పెరిగిపోతున్నపుడు పోటీ చేయడం లేదనే విషయాన్ని చల్లగా బయటపెట్టారు. దాంతో ఆమె వైఖరిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే మాయావతిపై జనాల్లో ఉన్న అనుమానాలు తాజా ప్రకటనతో బలపడుతున్నాయి. విషయం ఏమిటంటే దాదాపు ఐదు మాసాలుగా యూపీ రాజకీయం బాగా వేడెక్కింది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ర్యాలీలు, రోడ్డుషోలతో నానా హడావుడి చేస్తున్నారు. చివరకు చిన్నా చితక పార్టీలు కూడా జనాల్లోనే ఉంటున్నాయి. మిగిలిన పార్టీలు ఇంత హడావుడి చేస్తున్నా మాయావతి మాత్రం పెద్దగా జనాల్లో కనబడలేదు. రోడ్డు షోలు లేవు, ర్యాలీలు తీయలేదు. చివరకు రాష్ట్రవ్యాపత్తంగా పర్యటనలు చేసి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా పెట్టలేదు. ఇక్కడే ఆమెపై అనుమానాలు మొదలయ్యాయి.

నరేంద్రమోడికి పరోక్షంగా మాయావతి మద్దతు పలుకుతున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే బీఎస్పీకి సుమారు 20 శాతం ఓటింగుంది. రాష్ట్రంలోని దళితుల్లో మెజారిటి వర్గం ఇప్పటికీ మాయావతికే మద్దతుగా నిలుస్తున్నారు. దళితులు+బ్రాహ్మణుల కాంబినేషన్ను తెరపైకి తెచ్చి 2007లో అధికారంలోకి కూడా వచ్చారు. అయితే ఆమె ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి ఆరోపణలు కామన్ అయిపోయాయి.

దాంతో ఆమెపై సీబీఐ కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తయి చార్జిషీటు కూడా దాఖలు చేశారు. దాంతో ఎప్పుడైనా మాయావతి అరెస్టు తప్పదనే ప్రచారం ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలోనే మాయావతి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారా అనే అనుమానాలున్నాయి. మోడీకి సహకరించటం ద్వారా కేసుల్లో నుండి బయటపడాలని మాయావతి ఆలోచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తాజా ప్రకటన ఊతమిస్తోంది.