Begin typing your search above and press return to search.
జూన్ 21న ప్రపంచం అంతం...కుట్ర సిద్ధాంతకర్తల హెచ్చరిక !
By: Tupaki Desk | 15 Jun 2020 12:40 PM ISTప్రస్తుతం ప్రపంచం మొత్తం కంటికి కనిపించని వైరస్ తో యుద్ధం చేస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచమంతా పోరాడుతోంది. రోజురోజుకీ ఈ వైరస్ బారిన పడి చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచమే అంతం కాబోతుందంటూ మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మాయన్ క్యాలెండర్ తప్పుంటూనే.. 2020 ఏడాదిలో జూన్ 21న ప్రపంచమంతా అంతం తప్పదంటూ కుట్ర సిద్ధాంతకర్తలు అభిప్రాయపడుతున్నారు.
గతంలో 2012 లో యుగాంతం వస్తుంది అని, ప్రపంచం మొత్తం అంతం అవుతుంది అని ప్రపంచ వ్యాప్తంగా ఓ వార్త పెద్ద దుమారం రేపింది. అయితే, అందరూ ఉహించినట్టుగా 2012 డిసెంబర్ 21న యుగాంతం రాలేదు. యుగాంతం పుకార్లను హాలీవుడ్ మాత్రం బాగా క్యాష్ చేసుకుంది. 2012 యుగాంతం పేరుతో సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన కలెక్షన్లు వసూలు చేసింది.
పురాతన మయాన్ క్యాలెండర్ ప్రకారం 2012 డిసెంబర్ 21న యుగాంతం తప్పదు అనే వాదన అప్పట్లో చేశారు. అయితే ,తాజాగా అదే మయాన్ క్యాలెండర్ ప్రకారం మరో వాదన తెరపైకి వచ్చింది. 2020 జూన్ 21న యుగాంతం రాబోతుందట. అప్పట్లో మయాన్ క్యాలెండర్‌ను పొరపాటుగా చదివారట. వాస్తవానికి అది 2020 అయితే, పొరపాటున 2012 అని చదివారట. ప్రస్తుతం వారు చెబుతున్న వాదన ప్రకారం వచ్చే ఆదివారమే (జూన్-21,2020) యుగాంతం రాబోతుంది.
జూలియన్ క్యాలెండర్ ప్రకారం టెక్నికల్ గా మనం 2012లోనే ఉన్నాం. జూలియన్ క్యాలెండర్ నుంచి మనం గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి రావడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గుతుంది. 1752 నుంచి 2020 వరకు అంటే 268 సంవత్సరాలు. సంవత్సరానికి 11 రోజులు చొప్పున తగ్గాయి కాబట్టి 268ని 11తో గుణిస్తే 2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి, ఆ 2948ని 365తో భాగిస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన 2020లో 8 సంవత్సరాలు తీసేస్తే 2012లోనే ఉన్నట్టు లెక్క అని సైంటిస్ట్ పాలో టగోల్గన్ ట్వీట్ చేసినట్టు సన్ పత్రిక కథనాన్ని వెలువరించింది. అయితే , అసలు నిజంగా యుగాంతం వస్తుందా ? రాదా ? అనేది తెలియాలి అంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.