Begin typing your search above and press return to search.

ఆ యువకుడి ఇంట్లో ‘మత్తు వదలరా’ సినిమా సెటప్..: యువకుడి అరెస్టు

By:  Tupaki Desk   |   1 April 2022 7:30 AM GMT
ఆ యువకుడి ఇంట్లో ‘మత్తు వదలరా’ సినిమా సెటప్..: యువకుడి అరెస్టు
X
బీటెక్ వరకు చదివిన ఓ కుర్రాడు ఉన్నత స్థానంలో నిలవాలనే ఆశతో హైదరాబాద్ కు వచ్చాడు. అనుకున్నది సాధించేందుకు ఓ ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడు డ్రగ్స్ కు బానిసయ్యాడు. అయితే కొన్ని రోజుల తరువాత డ్రగ్స్ లభ్యం కాకపోవడంతో తానే డ్రగ్స్ ను తయారు చేయగలిగాడు. ఇందుకు అవసరమైన సామగ్రిని తెచ్చుకొని ఇంట్లోనే దుకాణం పెట్టాడు. అయితే అక్రమ దారిలో డబ్బులు సంపాదిద్దామనుకున్న ఆ యువకుడి ప్రయత్నాలు పోలీసులు కట్టడి చేశారు. అతడు డ్రగ్స్ దందా మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టాడు. ఆ మధ్య 'మత్తు వదలరా' అనే సినిమాలో కనిపించిన సీన్స్ హైదరాబాద్లో కళ్లకు కట్టినట్లు కనపించడంపై పోలీసులు ఆశ్చపోతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు..? ఫుల్ స్టోరీ ఏంటి..?

డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ఓ వైపు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా గురించి ఎలాంటి సమాచారం దొరికినా వెంటనే అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలసులు అప్రమత్తమయ్యారు. అయితే ఓ యువకుడు ఏకంగా ఇంట్లోనే డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. తన ఇల్లునే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చుకొని డ్రగ్స్ దందా నడపడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సూర్యపేట జిల్లాకు చెందిన శ్రీరామ్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. కొన్ని రోజుల తరువాత డ్రగ్స్ అలవాటు పడ్డ శ్రీరామ్ ఆ తరువాత అతని చేష్టలతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో డ్రగ్స్ కు డబ్బుల్లేకపోవడంతో తానే డ్రగ్స్ ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన డ్రగ్స్ తయారీపై పెద్ద పరిశోధనే చేశాడు.

ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డ్రగ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆ తరువాత డ్రగ్స్ తయారు చేసుందుకు అవసరమైన ముడి సరుకులను ఆన్లైన్లో తెప్పించుకున్నాడు. ఆన్లైన్లో దొరకని వస్తువులను హైదరాబాద్లో షాపులకు వెళ్లి తీసుకునేవాడు. ఎందుకోసం అని అడిగితే కాలేజీలోనీ ల్యాబ్ రీసెర్చ్ కోసమని చెప్పేవాడు.

ఇక అన్ని ముడిసరుకులను సమకూర్చుకున్న తరువాత వేదిక కోసం తీవ్రంగా ఆలోచించాడు. చిరవకి తన ఇంటినే డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు. జూబ్లిహిల్స్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. తాను తయారు చేసిన డ్రగ్స్ ను ముందుగా తనపై ప్రయోగం చేశాడు. ఆ తరువాత స్నేహితులకు అందించాడు. సక్సెస్ కావడంతో ఆ తరువాత వ్యాపారం మొదలుపెట్టారు. ఒక్క గ్రామ్ 20 మందికి కిక్ ఇవ్వడంతో ఈ గ్రామ్ ను 8వేల రూపాయలకు అమ్ముడు ప్రారంభించాడు. అయితే ఈ వ్యాపారంతో కొద్దిరోజుల్లోనే కోటీశ్వరుడవుదామని ఆలోచించాడు. కానీ ఈ సమాచారం పోలీసులకు అందింది.

వెంటనే రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తరువాత అసలు విషయాన్ని తెలుసుకున్నారు. అచ్చం సినిమాల్లో చూపిన విధంగానే సెటప్ చేయడం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఆ యవకుడిపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలేది లేదని, యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.