Begin typing your search above and press return to search.

భయంతో వణికే దుర్మార్గం పాట్నాలో చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   18 Aug 2022 8:00 PM IST
భయంతో వణికే దుర్మార్గం పాట్నాలో చోటు చేసుకుంది
X
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. భయానికి గురయ్యే ఉదంతం ఒకటి తాజాగా బిహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదివే ఆ చిన్నారిని ప్రేమ పేరుతో పదిహేనేళ్ల కుర్రాడు వెంటపడుతున్నాడు.

అతడి మాటకు నో చెప్పటం ఇప్పుడు ఆమె ప్రాణాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన మానాన తాను వెళుతున్న ఆ అమ్మాయిని వెంబడించిన ఉన్మాది పిస్టల్ తో కాల్పులు జరిపాడు.

దీంతో.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చి వైరల్ గా మారింది.

తన ప్రేమకు నో చెప్పిందన్న కోపంతో అమ్మాయిపైన పిస్టల్ తో కాల్పులు జరిపిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కాల్పులతో తీవ్ర గాయాలకు గురైన ఆమెను.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పాట్నాలోని కూరగాయలు అమ్మే వ్యాపారి కుమార్తె అయిన బాధితురాలు ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఆమె వీధిలోకి వస్తున్న విషయాన్ని ముందుగానే గుర్తించిన ఉన్మాది.. ఆమె కంటే ముందే బయట నిలబడటం.. ఆమె బయటకు వచ్చి తన దారిన తానువెళున్నప్పుడు.. తనను దాటి నాలుగు అడుగులు వేసిందో లేదో.. వెనుక నుంచి కాల్పులు జరిపి పారిపోయిన వైనం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.