Begin typing your search above and press return to search.
ఆ ఇంట్లో భారీ చోరీ.. కట్ చేస్తే.. దొంగతనం చేయించింది తెలిస్తే షాకే
By: Tupaki Desk | 25 May 2021 9:00 PM ISTకాలంతో పాటు చోటు చేసుకుంటున్న మార్పులు జీర్ణించుకోలనివిగా ఉంటున్నాయి. కట్టుకున్న మొగుడ్ని చంపేసే పెళ్లాలు.. ప్రియుడి మోజులో సొంతింట్లో చోరీలు చేస్తున్న భార్యమణులు లాంటి ఉదంతాలు గతంలో ఉండేవి కాదు. ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లో రూ.65 లక్షలకు పైగా బంగారం.. వెండి చోరీ జరగటంతో కంప్లైంట్ ఇచ్చిన పెద్ద మనిషికి.. తీరా దొంగతనం చేసింది భార్యనే కావటం ఈ ఉదంతంలో భారీ ట్విస్టుగా చెప్పాలి. సొంతింట్లో అంత భారీ చోరీ చేసిన భార్యమణి ఉదంతంలోకి వెళితే..
ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన శివప్రకాష్ కు.. అర్చనలకు 2008లో పెళ్లైంది. వారికి ముగ్గురు పిల్లలు. కాల క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు రావటం.. అవి కాస్తా పెరిగి పెద్దవి అయ్యాయి. ఈ క్రమంలో ఏడాది నుంచి పిల్లలతో కలిసి గుంటూరు జిల్లాలోని తల్లి వద్ద ఉంటోంది. ఇక్కడే క్రిష్ణ ప్రసాద్ అనే వ్యక్తి మోజులో పడింది. అతడితో వివాహేతర సంబంధానికి తెర తీసింది. ఇదిలా ఉంటే.. నెల క్రితం అత్తగారు చనిపోయిన సమాచారంతో భర్త వద్దకు వెళ్లింది.
ఇంట్లో ఉన్న బంగారం.. వెండిని దొంగలించాలని ప్లాన్ చేసింది. అందుకు తన ప్రియుడి సాయం కోరింది. క్రిష్ణప్రసాద్ ను ఊరికి పిలిపించింది. భర్త నిద్రపోతున్నప్పుడు అతడికి తెలీకుండా అతడి జేబులోని లాకర్ తాళాల్ని తీసుకుంది. అందులోని బంగారు.. వెండి వస్తువుల్ని దోచేసింది. వీటి విలువ దాదాపు రూ.65లక్షలకు పైనే ఉంటుందని అంచనా. తర్వాత తనకేం తెలీనట్లు అమాయకంగా ఉండిపోయింది. తన ఇంట్లో జరిగిన భారీ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు శివప్రకాష్. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీకి ప్లాన్ చేసింది భార్య ఆర్చనే అన్న నిజం బయటకు రావటంతో షాకింగ్ గా మారింది.