Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ లేదని లక్షలు దోచేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులు !
By: Tupaki Desk | 15 May 2021 8:00 AM ISTదేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు , జెట్ స్పీడ్ తో కొనసాగుతుంది. ఈ సెకండ్ వేవ్ లో కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అలాగే వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ సెకండ్ వేవ్ లో ముఖ్యమైన సమస్య ఆక్సిజన్ కొరత. కరోనా భారిన పడిన వారిలో చాలామందికి శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందలు వస్తున్నాయి. దీనితో చాలామందికి ఆక్సిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనితో ఆక్సిజన్ కొరతను చూపిస్తూ కొన్ని ఆస్పత్రులు బాధితులు నుంచి అడ్డగోలు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి.
దేశంలో సెకండ్ వేవ్ విజృంభణ తో కొరత ఉందంటూ ఆస్పత్రి నుంచి అంబులెన్స్ వరకు ఒక్కసారిగా ధరలు పెంచాయి. ఆక్సిజన్, సిలిండర్ లదీ ఇదే పరిస్థితి. 800 ,1000 రూపాయిలు వరకు లభించే ఒక్కొక్క సిలిండర్ ను ఐదు, పదివేలు చెప్పి బిల్లులు వేస్తున్నారు. ఒక్క సిలిండర్ రూ.50 నుంచి రూ.100 పెరిగితే ప్రైవేట్ ఆస్పత్రులు వేలల్లో పెంచుతున్నాయి. ఒక్కొక్కసారి 50 వేలు కూడా పెట్టి ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేస్తున్నారు. పలు ఆస్పత్రిల్లో ఆక్సిజన్ లేదంటూ అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ కరోనాను అడ్డపెట్టుకొని ఆక్సిజన్ కొరతను ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. మెహిదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌజ్, టోలిచౌకి, ఓయూ కాలనీ పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆక్సిజన్ కొరత పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నాయని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరితే లక్షలు గుంజుతున్నారు. ప్రాణాలను కాపాడుకొనేందుకు నిరుపేద, మధ్యతరగతి వారు ఆస్తులను అమ్ముకుంటున్నారు. అయినా లాభం ఉండడం లేదని పలువురు కరోనా బాధితుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు.