Begin typing your search above and press return to search.
షార్జాలో ఘోర అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన భారీ బిల్డింగ్
By: Tupaki Desk | 7 May 2020 8:45 AM ISTక్రికెట్ మక్కాగా ప్రసిద్ధి చెందిన షార్జాలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ లేకున్నా... ఓ 50 అంతస్థుల భారీ భవంతి ఒక్కసారిగా అగ్ని కీలల్లో చిక్కుకుని చూస్తుండగానే కాలిపోయిన వైనం చూస్తుంటే... పెను ప్రమాదంగానే పరిగణించక తప్పదన్న వాదన వినిపిస్తోంది. అరబ్ షేకుల నగరంగా పేరొందిన షార్జాలో భవంతులన్నీ ఆకాశాన్ని తాకుతున్నట్లుగానే కనిపిస్తాయి. లెక్కకు మిక్కిలి ఫ్లోర్లతో అలరారే భారీ భవంతుల్లో దాదాపుగా అగ్ని ప్రమాదాలు జరిగిన దాఖలా కనిపించదు. ఆధునిక సాంకేతిక పరిజ్జానం తో నిర్మితమైన ఈ బిల్డింగులన్నీ చాలా సురక్షితంగానే ఉంటాయన్న వాదన కూడా ఉంది.
అయితే అదుకు భిన్నంగా పార్కంగ్ కోసం కేటాయించిన ఫ్లోర్లను మినహాయించి 47 ఫ్లోర్లతో ఉన్న ఈ భవంతి ఒక్కసారిగా మంటల్లో తగలబడిన వైనం అక్కడి వారిని తీవ్ర ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి. అక్కడి తాజ్ బెంగళూరు రెస్టారెంట్ కు సమీపంలో ఉంది. అయితే ఏమైందో తెలియదు గానీ... ఒక్కసారిగా భవంతిని మొత్తాన్ని అగ్ని కీలలు చుట్టుముట్టాయి. చూస్తుండగానే... ఆ మంటలు భవంతిని దహించివేశాయి. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోగానే మొత్తం భవంతిని మంటలు చుట్టు ముట్టేశాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా... వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని అధికారులు హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం ఎలా సంభవించిందన్న విషయంపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులను అక్కడి పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ఏ కారణం చేత సదరు భవంతిలో మంటలు చెలరేగాయో కూడా తెలియడం లేదు. చూస్తుంటే... షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నా,... షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదమే అయితే... చూస్తుండగానే.. మంటలు 47 అంతస్థులకు పాకడం నజంగానే ఆశ్చర్యంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదానికి సంబంధించి పలువురు చిత్రీకరించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయాయి.