Begin typing your search above and press return to search.

బహ్రెయిన్ లో భారీ అగ్నిప్రమాదం..వందమంది సజీవదహనం

By:  Tupaki Desk   |   17 Oct 2019 10:35 AM IST
బహ్రెయిన్ లో భారీ అగ్నిప్రమాదం..వందమంది సజీవదహనం
X
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బహ్రెయిన్ లోని కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ ప్రమాదంలో వంద మందికి పైగా సజీవదహనమైన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న వారు అక్కడిక్కడే కాలి బూడిద అయ్యారట. అయితే.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది? అన్న విషయంపైన క్లారిటీ రాలేదు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువమంది భారతీయులే కావటం గమనార్హం. సజీవ దహనమైన కార్మికుల్లో వందకు పైగా భారత కార్మికులు ప్రాణాలు వదిలినట్లు సమాచారం. వీరిలో పాతిక మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా చెబుతున్నారు.

సజీవ దహనమైన పాతిక మందిలో పదిహేను మంది వరకూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యలో మనోళ్లు మరింతమంది ఉందంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ప్రమాద తీవ్రతను చూస్తే.. మరిణించిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని.. మనోళ్లు కూడా ఎక్కువ మందే బాధితులు ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.