Begin typing your search above and press return to search.
హైదరాబాద్ నగర శివారులో భారీ బ్లాస్టింగ్.. పాపమంతా ఆ సంస్థదే
By: Tupaki Desk | 21 Aug 2020 10:45 AM ISTహైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో భారీ బ్లాస్టింగ్ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అక్కడి వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. కక్కుర్తితో వ్యవహరించిన గృహనిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాచుపల్లి - గండిమైసమ్మ రహదారిలోని వీఎన్ ఆర్ కాలేజీకి దగ్గర లో వాసవి కన్ స్ట్రక్షన్ సంస్థ భారీ వెంచర్ ను షురూ చేసింది. ఇందుకోసం కొండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేసేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరింది.
అందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. తాము కోరినట్లుగా అనుమతులు ఇవ్వని నేపథ్యంలో.. ఆ సంస్థ బరితెగింపునకు పాల్పడింది. భారీ ఎత్తున బ్లాస్టింగ్ ను చేపట్టింది. ఈ పేలుళ్ల తీవ్రతతో ఆ ప్రాంతానికి చెందిన వారు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కిపడితే.. ఈ పేలుడు చోటు చేసుకున్న ప్రాంతానికి కిలోమీటరు పరిధి వరకు పెద్ద ఎత్తున బండరాళ్లు రోడ్ల మీదకు వచ్చి పడటం షాకింగ్ గా మారింది. పెద్ద పెద్ద బండరాళ్లు.. వేగంగా దూసుకు వచ్చి రోడ్ల మీద పడటమే కాదు.. అక్కడికి దగ్గర్లోని షాపు మీద పడ్డాయి.
ఇక.. పేలుడు సమయంలో ఆ రోడ్డు వైపుగా వెళుతున్న ఒక కారు మీదకు పెద్ద రాయి పడటంతో కారు ధ్వంసమైంది. ఏం జరిగిందో అర్థం కాక.. కారులో ప్రయాణిస్తున్న వారు భయంతో కేకలు వేసిన వైనం చోటు చేసుకుంది. పేలుడు జరిపిన ప్రాంతానికి దగ్గర్లోని ఒక కాలేజీ హాస్టల్ కిటికి అద్దాలతోపాటు.. ఫర్నీచర్.. ఆ ప్రాంతంలో నిలిపి ఉంచిన బస్సులు ధ్వంసమయ్యాయి. నిర్మాణ సంస్థ బరితెగింపు.. ఆ ప్రాంతంలో నివిస్తున్న వారికి చేదు అనుభవాన్ని మిగల్చటంతో పాటు.. భయాందోళనలకు గురయ్యేలా చేసింది.