Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్‌‌: దేశంలో 18 లక్షలకు పైగా అబార్షన్లు జరిగాయట !

By:  Tupaki Desk   |   13 Jun 2020 1:30 PM GMT
లాక్‌డౌన్‌‌: దేశంలో 18 లక్షలకు పైగా అబార్షన్లు జరిగాయట !
X
దేశంలో వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా దేశంలోని అన్ని ఆస్పత్రులన్ని కరోనా బాధితుల ట్రీట్ మెంట్ సెంటర్లుగా మారిపోయాయి. ఈ లాక్‌డౌన్‌ సమయంలో అత్యంత భారీగా అబార్షన్లు గైనకాలజిస్ట్‌ సలహా లేకుండానే జరిగినట్లుగా సర్వేలే వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 18.5 లక్షల అబార్షన్‌లు జరిగాయని తెలుస్తోంది.

మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్‌ డెవలప్ ‌మెంట్‌ ఫౌండేషన్ ఈ సర్వేను నిర్వహించింది. లాక్‌ డౌన్‌ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై ఈ సర్వే దృష్టి పెట్టింది. లాక్ ‌డౌన్‌1, 2 దశల్లో 59 శాతం మహిళలకు అబార్షన్‌ అంశంలో ఆస్పత్రికి వెళ్లడం, వైద్యులను కలవడం వంటి సదుపాయాలు లభించలేదని తెలిపింది. అన్‌ లాక్‌ దశలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని.. ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది.

ఈ క్రమంలో ఐడీఎఫ్‌ సీఈఓ వినోజ్ మానింగ్ మాట్లాడుతూ.. 18.5 లక్షల మంది మహిళలకు అబార్షన్‌ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో.. ఐసోలేషన్ వార్డులుగా మారిపోయిన క్రమంలో వైద్య సిబ్బంది వైరస్ నియంత్రణ మీదనే ఉన్నందున వారు అబార్షన్లు చేయించుకోవటం కుదరలేదనీ, దాని సేఫ్టీ అబార్షన్లు కుదరకు ఏమాత్రం సేఫ్టీ లేని అబార్షన్లు చేయించుకున్నారని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులు క్లోజ్ చేశారని, దాంతో సేఫ్టీ అబార్షన్లకు ఆస్కారం లేకుండా పోవటంతో అసురక్ష గర్భస్రావాలు జరిగాయని తెలిపారు.