Begin typing your search above and press return to search.

ఏరియా మాస్‌ మంత్రి క్లాస్ షింక్ అవ్వ‌ట్లేదుగా!

By:  Tupaki Desk   |   5 Oct 2019 12:18 PM GMT
ఏరియా మాస్‌ మంత్రి క్లాస్  షింక్ అవ్వ‌ట్లేదుగా!
X
అది మాస్ ఏరియా.. మ‌రి అలాంటి చోట రాజ‌కీయాలు చేయాలంటే.. కొంత మేర‌కు దూకుడు త‌ప్ప‌దు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వంలో సీఎం జ‌గ‌న్ ఏరి కోరి ఎంచుకుని మంత్రి ప‌ద‌వి ఇచ్చిన నాయ‌కుడు మాత్రం స్లీపింగ్ బుద్దా టైపులో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలితో పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. దీంతో ఇప్ప‌టికైనా మంత్రిగారు దూకుడు పెంచాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆ నియ‌జ‌క‌వ‌ర్గం ఎక్క‌డ‌? మ‌ంత్రి ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఆయ‌నే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌. ధ‌ర్మాన సోద‌రుల్లో పెద్ద‌వాడు అయిన కృష్ణ‌దాస్ చాలా సౌమ్యుడు.

వివాద ర‌హితంగా ఆయ‌న రాజ‌కీయాలు చేశారు. క‌నీసం చీమ‌కు కూడా హాని త‌ల‌పెట్ట‌లేదు. అలాంటి నాయకుడు వైఎస్ అంటే ప్రాణం ఇస్తాడు. అందుకే ఆయ‌న వైసీపీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌మ్ముడు మాజీ మంత్రి ప్ర‌సాద‌రావు అయినా.. కొంత మేర‌కు లేట‌య్యాడే మో కానీ, దాస్ మాత్రం వైఎస్ ఫ్యామిలీకి అడుగ‌డుగునా అండ‌గా ఉన్నారు. జ‌గ‌న్ కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి జిల్లాలో తొలి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న భార్య ప‌ద్మ‌ప్రియ జిల్లా వైసీపీ క‌న్వీన‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

ఆ త‌ర్వాత కృష్ణ‌దాస్ 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచారు. ఆ వెంట‌నే దాస్‌కు జ‌గ‌న్ అధి కారంలోకి రాగానే మంత్రిగా ప‌దవి ఇచ్చారు. అయితే, ఆయ‌న మంత్రి అయినా.. జిల్లా లో రాజ‌కీయా ల‌పై ప‌ట్టు సాధించ‌లేక పోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై రెచ్చిపోతున్న మాజీ మంత్రి అచ్చ‌న్న కు ముకుతాడు వేయ‌డంలోనూ వైసీపీ దూకుడు పెంచ‌డంలోనూ దాస్ ఫెయిల‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు విని పిస్తున్నాయి. నిజానికి శ్రీకాకుళం.. ప‌క్కా మాస్‌. ఇక్క‌డ రాజ‌కీయాలు కూడా అలానే ఉండాలి. టీడీపీ నేత‌, మాజీ మంత్రి అచ్చ‌న్న ఇక్క‌డి టెక్క‌లి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఆయ‌న అధికార పార్టీపై రెచ్చిపోతున్నారు. మ‌రి ఆయ‌న‌కు ప‌క్కాగా స‌మాధానం చెప్పే రీతిలో మంత్రి దాస్ వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. కౌంట‌ర్ ఇచ్చే ప‌రిస్థితి లేక పోవ‌డం కూడా గ‌మ‌నార్హం.

పోనీ.. ప్ర‌సాద‌రావు ఉన్నారంటే.. ఆయ‌న పూర్తిగా మౌనం వ‌హించారు. తాను గ‌తంలో మంత్రిగా ఉండి.. సీనియ‌ర్‌గా ఉన్నా ఇప్పుడు మంత్రి ప‌ద‌వి లేక‌పోవ‌డంతో ధ‌ర్మాన అస‌హ‌నంతో ఉంటున్నారు. దీంతో ఇక్క‌డి వైసీపీ శ్రేణుల్లో అల‌జ‌డి నెల‌కొంది. మంత్రిని మార్చాల‌ని వారు ప‌ట్టుబుడుతున్నారు. లేదా దాస్ రీచార్జ్ కావాల‌ని కోరుతున్నారు. నిజానికి రాష్ట్రంలో త‌లెత్తుకోలేని ప‌రిస్థితిని కొని తెచ్చుకున్న టీడీపీ కేవలం ఈ ఒక్క జిల్లాలోనే గ‌ళం వినిపిస్తోందంటే.. వైసీపీ నాయ‌కులు, మంత్రి ఎంత బ‌ల‌హీనంగా ఉన్నారో అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు వైసీపీ నేతలు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.