Begin typing your search above and press return to search.

తెలంగాణ లో మళ్లీ మాస్క్ నిబంధన

By:  Tupaki Desk   |   2 Dec 2021 10:32 AM GMT
తెలంగాణ లో మళ్లీ మాస్క్ నిబంధన
X
కరోనా కట్టడిలో ప్రధానమైనది మాస్క్ ధారణ. తద్వార వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకుండా నిరోధించే అవకాశం కలుగుతుంది. అయితే, సెకండ్ వేవ్ ముగియడం.. టీకా పంపిణీ పెరగడంతో చాలా మంది ఈ నిబంధనకు రాంరాం చెబుతున్నారు.

ఇందులో ఎక్కువమంది నిర్లక్షంగానూ వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఫస్టవేవ్ సమయంలో చాలామంది భయానికి మాస్క్ ధరించారు. వేవ్ ముగిశాక విస్మరించారు. దీంతో డెల్టా వేరియంట్ పుట్టుకొచ్చి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కేంద్ర్ర ప్రభుత్వం కొవిడ్ నిబంధనలపై రాష్ట్రాలను హెచ్చరిస్తూనే ఉంది.

కరోనా ముగియలేదని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. కానీ, ఎక్కువ శాతం మంది ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా విధించాలని భావిస్తోంది.

ఒమిక్రాన్ భయంతో దక్షిణాఫ్రికాలో పుట్టి.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ జాగ్రత్తలను గుర్తుచేస్తోంది. తాజాగా యూకే నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్ గా తేలింది. దీంతో మళ్లీ మాస్క్ కచ్చితం నిబంధన అమలు చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి చాలామంది ప్రజల డిమాండ్ కూడా ఇదే. కాగా, ఒమైక్రాన్ కలకలంతో మాస్క్, వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు వైద్య శాఖ సూచించింది. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని, వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాల్సిందేనని పేర్కొంది

అంతేకాక వ్యాక్సిన్ పై కచ్చితమైన నిబంధనలు రూపొందించబోతున్నామని తెలిలిపింది. హోటల్స్, పార్క్లులు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం కచ్చితం చేయాలని భావిస్తోంది. వ్యాక్సిన్ వేసుకోనివారికి ఎక్కడికీ ప్రవేశం లేకుండా చేయాలని ఆలోచిస్తోంది.