Begin typing your search above and press return to search.

దేశంలో మరో రికార్డ్ సృష్టించిన మారుతి సుజుకి !

By:  Tupaki Desk   |   17 Nov 2020 12:00 PM IST
దేశంలో మరో రికార్డ్ సృష్టించిన మారుతి సుజుకి !
X
భారతదేశంలో అతి పెద్ద కార్ల సంస్థ అయిన మారుతి సుజుకి మరో రికార్డ్ సృష్టించింది. ఆన్లైన్ లో రెండు లక్షల కార్లను అమ్మేసింది. గత రెండేళ్ల క్రితం మారుతి ఆన్లైన్ లో అమ్మకాలని ప్రారంభించగా .. ఇప్పటివరకు రెండు లక్షల కార్లను అమ్మింది. 2018లో కొత్త డిజిటల్ ఛానల్‌‌ను ప్రవేశపెట్టిన తర్వాత..డిజిటల్ ఎంక్వైరీలు మూడింతలు పెరిగాయి. 2019 ఏప్రిల్ నుంచి రెండు లక్షలకు పైగా వెహికల్స్‌‌ ను డిజిటల్ ప్లాట్‌‌ ఫామ్ ద్వారా విక్రయించాం. 21 లక్షలకు పైగా ఎంక్వైరీలను జనరేట్ చేసేందుకు ఈ డిజిటల్ ఛానల్ ఉపయోగపడింది అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ప్రకటించారు.

గూగుల్ ఆటో గేర్ సిఫ్ట్ ఇండియా 2020 రిపోర్ట్ ప్రకారం సుమారు 95 శాతం కొత్త కారు సేల్స్ ఇండియాలో డిజిటల్‌‌ గా ప్రభావితమై జరుగుతున్నాయి. కారు కొనాలనుకునేవారు మొదటగా ఆన్ ‌‌లైన్ ‌‌లో కొత్త కార్ల గురించి తెలుసుకొని, ఆ తర్వాత డీలర్‌‌‌‌ షిప్‌‌ల వద్దకి వెళ్లి కొంటున్నట్టు తెలిపారు. తమ డిజిటల్ ఛానల్ ద్వారా ఎవరైతే కస్టమర్లు ఎంక్వైరీ చేస్తారో, వారు పది రోజుల్లో వెహికల్‌‌ను కొంటున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. డిజిటల్ ఎంక్వైరీలను సేల్స్‌‌గా మార్చడం చాలా తేలిక అవుతుంది అన్నారు. 2017 నుంచే మారుతీ సుజుకి ఇండియా ఆన్ ‌‌లైన్‌‌ లో బుకింగ్స్‌‌ తీసుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం కస్టమర్లు ఆన్ ‌‌లైన్ ‌ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని , డీలర్ ‌‌‌‌షిప్ వెబ్‌‌ సైట్లకు పెద్ద మొత్తంలో ట్రాఫిక్ వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారితో గత ఐదు నెలల్లో డిజిటల్ ఎంక్వైరీ కంట్రిబ్యూషన్ 33 శాతానికి పైగా పెరిగిందని మారుతీ సుజుకి ప్రకటించింది.