Begin typing your search above and press return to search.
రైతుని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష బహుమతి
By: Tupaki Desk | 31 Jan 2019 10:01 AM GMTవ్యవసాయం చేయడానికి రైతు కావాలి - పాడిపంటలు కావాలంటే రైతు కావాలి. ఉన్న భూమిని సాగు చెయ్యడానికి రైతు కావాలి. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం రైతు అవసరం లేదు. ఇదీ ప్రస్తుతం మన దేశంలో యువరైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య. ప్రతీ అమ్మాయి - అమ్మాయి తండ్రి సాఫ్ట్ వేర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి సంబంధాలే కావాలని అడుగుతున్నారు. అందరూ ఇలాంటి సంబంధాలు కోరుకుంటే.. మరి యువరైతుల పరిస్థితి ఏంటి.? ఇదే విషయంపై సీరియస్ గా ఆలోచించింది ఉత్తర కర్నాటకలో ఉన్న అనగోడు సేవా సహకారి సంఘం (కో ఆపరేటివ్ సొసైటి). తమ చుట్టు పక్కన ఊళ్లలో రైతులకు పిల్ల దొరకడమే కష్టంగా ఉందని గమనించిన ఈ కో ఆపరేటివ్ సోసైటీ.. రైతుని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
ఉత్తర కర్నాటకలోని అనగోడు అనే గ్రామంలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో డిగ్రీ పూర్తైన వ్యక్తి కూడా వ్యవసాయమే చేస్తుంటాడు. కానీ వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుందో లేదో తెలీని పరిస్థితి. అందుకే.. ఈ గ్రామంలో ఉన్న ఆడపిల్లల తల్లితండ్రులంతా రైతులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో.. ఈ లక్ష రూపాయల కార్యక్రమాన్ని పెట్టింది. అయితే.. ఇక్కడ కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అబ్బాయి కచ్చితంగా అనగోడు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కుర్రాడై ఉండాలి. అన్నింటికి మించి వ్యవసాయం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు వరకు ఉండాలి. మరి ఈ కొత్త పథకం ద్వారా అయినా అనగోడు రైతులకు పెళ్లాడేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపుతారో లేదో.. చూడాలి.