Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ !
By: Tupaki Desk | 30 Nov 2021 10:00 PM ISTఐపీఎల్ లో ఒక్క పెర్ఫామెన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు రాహుల్ తెవాటియా. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడైన అతను ఐపీఎల్-2020 ఎడిషన్ లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై చేసిన హాఫ్ సెంచరీ అతన్ని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. ఈ డ్యాషింగ్ ఆల్ రౌండర్ ఒక ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిద్ధి పన్ను, రాహుల్ తెవాటియా ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ సోమవారం పెళ్లి చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, నితీష్ రాణా తదితరులు హాజరయ్యారు. ఇటీవలే చాహల్ కూడా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో రాహుల్ కు చోటు దక్కింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే 2021 ఐపీఎల్ ఎడిషన్ లో రాహుల్ ఏమాత్రం ప్రభావం చూపలేక నిరాశపరిచాడు. మరికొన్ని నెలల్లో మొదలయ్యే ఐపీఎల్ లో రాణించి, మళ్లీ భారత జట్టుకు ఎంపికవడమే ఇప్పుడు అతని ముందున్న లక్ష్యం. ఐపీఎల్ 2020 సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది, స్టార్‌గా మారిపోయాడు రాహుల్ తెవాటియా.