Begin typing your search above and press return to search.

నచ్చని పెళ్లి చేసుకున్నారని.. 28 ఏళ్ల తర్వాత దారుణంగా దాడి

By:  Tupaki Desk   |   12 July 2021 8:36 AM IST
నచ్చని పెళ్లి చేసుకున్నారని.. 28 ఏళ్ల తర్వాత దారుణంగా దాడి
X
మొండితనం.. అంతకు మించిన మూర్ఖత్వం రాయలసీమ ఫ్యాక్షన్ కథల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుందన్న మాట బయట వారి నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని అక్కడి వారి కోణంలో చూస్తే.. తమదైన పరిమిత ప్రపంచంలో తాము చేస్తున్నది సరైనదనే భావన వారిలో కనిపిస్తుంది. వాస్తవానికి సీమ ఫ్యాక్షన్ కు సినిమాటిక్ గా చూపించటం ఎక్కువ కావటంతోఅసలు కంటే కొసరు అన్న చందంగా.. ఉన్న ఫ్యాక్షన్ కు సంబంధం లేని అంశాలు చూపించటం ఎక్కువ అవుతోంది. తాజా ఉదంతాన్ని చూస్తే.. సినిమాల్లో చూపించే ఫ్యాక్షన్ కనిపిస్తుంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కర్ణాటకలో కులాంతర వివాహం చేసుకున్న ఒక జంటపై దాడి జరిగింది. అదేమంత పెద్ద విషయమా? అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే వారి పెళ్లైన 28 ఏళ్లకు దాడి జరగటమే దీనికి కారణం. రోన్ తక్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దాడి ఇప్పుడు పెను సంచనలంగా మారింది. బెంగళూరు మహానగరానికి 385 కిలోమీటర్ల దూరంలోని గదగ్ జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భర్తది అగ్ర వర్ణం కాగా.. భార్యది వెనుకబడిన కులం. దీనిపై రగిలిపోతున్న భర్త తరఫు బంధువులు భార్యపై దాడి చేయటం.. ఆమెను గాయపర్చిన వైనం షాకింగ్ గా మారింది.

సాధారణంగా రాయలసీమ ఫ్యాక్షన్ లో అదెంత పెద్ద పంచాయితీ అయినా.. ఎంత పెద్ద పగ అయినా మహిళలపై మాత్రం ఎలాంటి దాడి చేయటానికి ఇష్టపడరు. కానీ.. అంతకు మించిన మూర్ఖత్వం తాజా ఉదంతంలో కనిపిస్తుంది. దాడికి గురైన జంట తమ వివరాల్ని బయటకు వెల్లడించేందుకు ఇష్టపడకపోవటంతో వారికి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు. అనుకుంటాం కానీ..చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాలే చాలా బెటర్ . కొన్ని రాష్ట్రాల్లో కులాంతర.. మతాంతర వివాహాలపై భారీగా ప్రతిస్పందన ఉంటుంది. అలా అని తెలుగు రాష్ట్రాల్లో లేవని కావు. కాకుంటే.. మిగిలిన రాష్ట్రాల కంటే చాలా మెరుగైన పరిస్థితి నెలకొని ఉండటమే కాదు.. ఇటీవల కాలంలో ఈ తరహా పెళ్లిళ్లకు ఆమోదం ఎక్కువ అవుతోంది.

కానీ.. కర్ణాటకలో అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికి ఆ రాష్ట్రంలో వెనుకబడిన కులాలపై దాడులు ఎక్కువగానే సాగుతుంటాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య షెడ్యూల్ కులాలు.. తెగలపై దాడులు జరిగినట్లుగా అధికారికంగానే 2327కేసులు నమోదు కాగా.. నమోదు కాని కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతారు. గత ఏడాదితో పోలిస్తే 54 శాతం కేసులు పెరిగినట్ులగా నేషనల్ క్రైం బ్యూరో వెల్లడించింది. కులాలకు అతీతంగా జరిగే ప్రేమ వివాహాల విషయంలో చోటు చేసుకునే దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.