Begin typing your search above and press return to search.

అమ్మో పెళ్లిళ్లకు అంత ఖర్చా!!

By:  Tupaki Desk   |   20 Nov 2016 10:30 PM GMT
అమ్మో పెళ్లిళ్లకు అంత ఖర్చా!!
X
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా శుభ వాతావరణమే... అయితే.. నోట్ల రద్దు దెబ్బకు కొంత కళ తగ్గుతోంది. ముఖ్యంగా పెళ్లి ఖర్చులు - ఇతర ఏర్పాట్లకు డబ్బులు సర్దుబాటు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఉన్నంతలో పెళ్లిళ్లు ఘనంగా చేయడానికే అంతా ప్రయత్నిస్తున్నారు. అసలు ఇండియాలో పెళ్లంటే అదో పెద్ద పండుగే కదా. నాలుగు రోజుల కిందట మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి కూతురు పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. ఇండియాలో వివాహాలు ఎంత పెద్ద ఈవెంట్లో.. ఎంత పెద్ద మార్కెట్టొ తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం.

- మన దేశంలో ఒక ఏడాదిలో జరిగే పెళ్లిళ్లకయ్యే ఖర్చు సగటు: రూ.3,29,000 కోట్లు

- ఇందులో 24 శాతం విందు భోజనాలకే ఖర్చు చేస్తారు.

- 16 శాతం నిధులు అలంకరణకు ఖర్చు చేస్తారు. మండపం ధగధగలాడిల్సిందే కదా. అందుకే అంత ఖర్చు.

- వేదిక కోసం పెట్టే ఖర్చు 12 శాతం

- ఇక పెళ్లి తరువాత హానీమూన్ కు వెళ్లేందుకు 9 శాతం ఖర్చవుతుంది.

- సంగీత్ - ఇతర వినోద కార్యక్రమాలకు 8శాతం

- అతిథులకు బస కోసం 7 శాతం

- వెడ్డింగ్ ప్లానర్ కు 7... బహుమతులకు 5 శాతం ఖర్చవుతుంది.

- వీడియోలకు 4... రవాణాకు 3 శాతం ఖర్చవుతుంది.

- పెళ్లి కుమారుడు - పెళ్లి కుమార్తె అలంకరణకు 3 శాతం

- ఆహ్వాన పత్రికలకు 2 శాతం నిధులు ఖర్చు చేస్తున్నారట.

- ఇక సమాజంలో వారి స్థాయిని బట్టి పెళ్లి ఖర్చు మారిపోతుంది.

భారతీయుల ఆర్భాటపు వివాహాలు

- లక్ష్మినివాస్ మిట్లల్ కుమార్తె వెనీషా వివాహానికి రూ. 330 కోట్లు ఖర్చు చేశారు.

- ఆయన తమ్ముడు ప్రమోద్ మిట్టల్ కూడా అన్నకు తగ్గ తమ్ముడనిపించుకుంటూ తన కుమార్తె పెళ్లికి 433 కోట్లు వెచ్చించారు.

- ఇక పోతే మొన్నటికి మొన్న గాలి జానార్దనరెడ్డి కుమార్తె పెళ్లికి కూడా 500 కోట్లకు పైగా ఖర్చయినట్లు చెబుతున్నారు.

- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/