Begin typing your search above and press return to search.
ఎత్తుకెళ్లి.. ఆపై పెళ్లి
By: Tupaki Desk | 21 Feb 2016 4:00 AM ISTచాలా తెలుగు సినిమాల్లో ఒక ఫార్ములా ఉంటుంది... విలన్ హీరోయిన్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.. నిజానికి ఇది సినిమాల్లోనే కాదు.. బయట కూడా చాలాచోట్ల జరుగుతుంటుంది. రీసెంటుగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ లో పనిచేస్తున్న దీప్తి సర్నా అనే ఉద్యోగిని పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ నేర గణాంక నమోదు సంస్థ లో ఉన్న వివరాలు చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి.
గత పదేళ్లలో ఇలాంటి పెళ్లి కిడ్నాప్ లు బాగా పెరిగిపోయాయి. 2005లో మొత్తం 22,832 కిడ్నాప్ లు జరగ్గా అందులో అపహరణకు గురైన మహిళల సంఖ్య 15,750.. వారిలో పెళ్లి కోసం కిడ్నాపైన వారు 9,637 మంది.
ఇక 2014కు వచ్చే సరికి ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 77,237 కిడ్నాప్ కేసులు నమోదు కాగా అందులో మహిళల కిడ్నాప్ లు 57,311.. అందులో పెళ్లి కోసం చేసిన కిడ్పాప్ లు 30,957.
ఇలా దుండగులు పెళ్లి కోసం కిడ్నాప్ చేస్తున్న మహిళల్లో సగం మంది 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు. ఆ తరువాత 16 నుంచి 17 ఏళ్ల అమ్మాయిల కిడ్నాప్ ల శాతం కూడా ఎక్కువగానే ఉంది. కిడ్నాప్ కు గురైన మిగతా మహిళల్లో ఎక్కువ మందిని రేప్ చేస్తున్నారు.
అపహరణకు గురవుతున్న ఆడవాళ్లలో 50.19 శాతంమందిని పెళ్లి కోసం అపహరిస్తుండగా 41.92 శాతం మందివి రేప్ కోసం జరిగిన కిడ్పాప్ లు.
ఇలా మహిళల కిడ్నాప్ లు ఎక్కువగా పాట్నా నగరంలో జరుగుతున్నాయి. ఆ తరువాత స్థానంలో ఫరీదాబాద్- భోపాల్ - మీరట్ - కోట - రాంచీ - జబల్ పూర్ - లూదియానా - వారణాసి - ఘజియాబాద్ లు ఉన్నాయి. ఇక రాష్ట్రాల విషయానికొస్తే మహిళల కిడ్పాప్ లు ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్నాయి. ఆ తరువాత స్థానంలో మధ్య ప్రదేశ్ - పశ్చిమబెంగాల్ - బీహార్ - రాజస్థాన్ - ఢిల్లీ - అస్సాం - మహారాష్ట్ర - ఒడిశా - గుజరాత్ ఉన్నాయి. అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలు టాప్ టెన్ లో లేవు.