Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ గెలుపున‌కు భ‌న్వ‌ర్‌ లాల్ హెల్ఫ్‌

By:  Tupaki Desk   |   10 Sep 2015 3:14 PM GMT
టీఆర్ ఎస్ గెలుపున‌కు భ‌న్వ‌ర్‌ లాల్ హెల్ఫ్‌
X
గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపున‌కు రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌ లాల్ సాయం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష‌య‌మై కొద్ది రోజుల క్రితం బీజేపీ, టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే లు ప్రాధినిత్యం వ‌హిస్తున్న నియోక‌వ‌ర్గాల్లోను, సెటిల‌ర్లు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఓట్లు తొల‌గిస్తున్నా ఎన్నిక‌ల క‌మిష‌న్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆరోపించారు. భ‌న్వ‌ర్‌ లాల్ కూడా ఈ విష‌యంలో అధికార పార్టీకే హెల్ఫ్ చేస్తున్నారంటూ ఆ రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆయ‌న పై ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా భ‌న్వ‌ర్‌ లాల్‌ పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు చేసింది. ఆయ‌న టీఆర్ ఎస్‌ కు కొమ్ము కాస్తూ గ్రేట‌ర్‌ లో ఆ పార్టీ విజ‌యానికి కృషి చేస్తున్నారంటూ స‌న‌త్‌ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయ‌న హైద‌రాబాద్‌ లో విలేక‌ర్ల‌ తో మాట్లాడుతూ ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తోంద‌న్నారు. ఈ విష‌య‌మై ఎన్నిక‌ల క‌మిష‌న్‌ కు ఫిర్యాదు చేసినా క‌నీసం స్పంద‌న కూడా లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

గ్రేట‌ర్‌ లోని చాలా డివిజ‌న్ల‌లో టీఆర్ ఎస్‌ కు అనుకూలంగా లేని ప్రాంతాల‌తో పాటు సీమాంధ్ర‌, ఉత్త‌రాది, మైనారిటీ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఓట‌ర్ల తొల‌గింపు జ‌రుగుతోంద‌న్నారు. ఇళ్లు మారార‌నే కార‌ణంగానే 24 శాతం ఓట్ల తొల‌గింపు జ‌రిగింద‌న్నారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తామని శశిధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

భ‌న్వ‌ర్‌ లాల్ ఇప్ప‌టికే అధికార పార్టీకి కొమ్మ‌కాస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎక్కువ‌గా రావ‌డంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్ని క‌లిసి అఖిల‌ప‌క్షంగా ఏర్ప‌డ‌నున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో పాటు హైకోర్టుకు దృష్టికి తీసుకువెళ్లేందుకు రెఢీ అవుతున్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌ పై గ‌తంంలోనే భన్వ‌ర్‌ లాల్ వివ‌ర‌ణ ఇచ్చినా ఆయ‌న‌ పై ఆరోప‌ణ‌లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.