Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ అధినేత ఇండియా​కు ఫ్లాటయ్యాడు

By:  Tupaki Desk   |   4 Nov 2015 8:53 AM GMT
ఫేస్ బుక్ అధినేత ఇండియా​కు ఫ్లాటయ్యాడు
X
ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల భారత్ లో పర్యటించి తిరిగి కాలిఫోర్నియా వెళ్లిపోయారు. అయితే, ఆయన కాలిఫోర్నియా వెళ్లినా కూ ఇండియాను మర్చిపోలేకపోతున్నారట. ఇండియాను తలచుకుని తలచుకుని మురిసిపోయి ఇంటిల్లిపాదికీ ఇక్కడి సంగతులే చెబుతున్నారట. అయితే... ఆయన తన ఇండియా పర్యటనను ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా మన వెబ్ సైటే కదా అని ఫేస్ బుక్ లో ఇండియా పర్యటనకు సంబంధించి తెగ పోస్టింగులు పెడుతున్నారు. ఆన్ లైన్ సమాజానికి తన భారత పర్యటన విశేషాలను ఫొటోలు, దానికి తగిన వ్యాఖ్యలతో వెల్లడిస్తున్నారు. అందరితో ఆ సంగతులు పంచుకుంటున్నారు.

జుకర్ బర్గ్ ఇండియా నుంచి తిరుగు ప్రయాణమైనప్పటి నుంచి రోజుకో పోస్టుతో భారత్ ను గుర్తుచేసుకుంటున్నారు . గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర తాను నడుస్తున్న ఫోటోను మొన్న పోస్టు చేసిన జుకర్ బర్గ్ తాజ్ మహల్ వద్ద నడుస్తున్న ఫోటోను నిన్న పోస్టు చేశారు . ఈ సందర్బంగా మరోసారి ఈ ప్రదేశాలని సందర్శించాలని ఉందనే కోరిక ఆయన వ్యక్తం చేశారు.

కాగా జుకర్ బర్గ్ పోస్టులకు ఆయన అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే.... ఇండియాలో ఉన్న దిగ్గజ ఐటీ సంస్థలు మాత్రం జుకర్ బర్గ్ నీడను చూసినా బెదిరిపోతున్నాయి. ఒకప్పుడు ఇండియాలో ప్రభుత్వాలకు ఐటీపరంగా ఎలాంటి అవసరం ఉన్నా తమ వద్దకే వచ్చారని... అలాంటిది జుకర్ బర్గ్ మోడీతో ఫ్రెండ్షిప్ చేస్తుండడంతో అలాంటి పనులన్నీ ఫేస్ బుక్కే చేపడుతోందంటూ కుళ్లుకుంటున్నారు. దేశంలో విద్యార్థులకు - మహిళా సంఘాలకు - స్వచ్ఛంద సంస్థలకు.. ఇలా ఎన్నోవర్గాలకు ఆన్ లైన్ వ్యవహారాలపై ఫేస్ బుక్ పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల కోరిక మేరకు అవగాహన, శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దేశీయ ఐటీ కంపెనీలు జుకర్ బర్గ్ ను చూసి మండిపడుతున్నాయి.