Begin typing your search above and press return to search.
ఇద్దరు కుబేరులు ఇండియా గురించి ఏం మాట్లాడుకున్నారు?
By: Tupaki Desk | 16 Dec 2020 8:39 AM ISTభారత్ లాంటి అతి పెద్ద దేశాన్నిఅన్ని విధాలుగా ప్రభావితం చేయగలిగిన అపర కుబేరుడైతే.. మరోకరు తన సాంకేతికతో కొత్త మలుపు తిప్పిన కుబేరుడు. అలాంటి ఇద్దరు ప్రముఖులు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది. వారి మాటలన్ని భారత్ గురించి అయితే.. అంతకు మించి ఇంకేం ఉంటుంది? తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ లు కలిసి మాట్లాడుకున్నారు.
డిజిటల్ ఇండియా భాగస్వామ్యం గురించి వారిద్దరి మధ్య సాగిన సంభాషణలో ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. అందులో కీలక అంశాలేమంటే.. సంక్షోభానికి.. ఉపద్రవాలకు కుంగిపోవటంభారత్ డీఎన్ఏలోనే లేదని రిలయన్స్ అధినేత పేర్కొన్నారు. ఆ మాటకు వస్తే.. సంక్షోభాన్ని కొత్త అధ్యాయానికి అవకాశంగా మలుచుకోవటం భారత్ కు అలవాటేనని ఆయన చెప్పరు.
రాబోయే రెండు దశాబ్దాల కాలంలో భారతదేశం ప్రపంచంలోని ఆర్థికవృద్ధి సాధించిన టాప్ మూడు దేశాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. కరోనా లాంటి ఉపద్రవం.. ఐదేళ్ల క్రితం వచ్చి.. దాన్ని భారత్ ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటే పరిస్థితి ఊహించని విధంగా ఉండేదన్నారు.
ఇక.. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. గత నెలలో తాము వాట్సాప్ పేను ఆవిష్కరించామన్నారు. యూపీఐ విధానంతో పాటు 140 బ్యాంకుల వల్లే తాము చేయగలిగామన్నారు. ఇలా చేయగలిగిన తొలి దేశం భారత్ మాత్రమే అని పేర్కొనటం చూస్తే.. ప్రపంచంలో మరే దేశం చేయలేనిది మనం మాత్రమే చేస్తున్నామంటే.. అంతకు మించి ఇంకేం కావాలి? ఏమైనా.. భారత్ గొప్పతనాన్ని ఇద్దరు కుబేరులు తమదైన శైలిలో చెప్పారు కదూ. అన్ని బాగానే ఉన్నా.. ఈ ఇద్దరు ప్రముఖులు.. భారత్ ఇంకా మార్చుకోవాల్సిన అంశాల్ని కూడా కాస్త ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది. అయినా.. ఒంట్లోని ప్రతి అణువును వ్యాపారంగా మలుచుకున్న ప్రముఖులు అలాంటి టాపిక్ ఎందుకు తెస్తారు?