Begin typing your search above and press return to search.

ఇండియా గురించి జుక‌ర్‌ బ‌ర్గ్ విస్మ‌య‌క‌ర నిజం

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:08 PM GMT
ఇండియా గురించి జుక‌ర్‌ బ‌ర్గ్ విస్మ‌య‌క‌ర నిజం
X
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్ బర్గ్‌ కు ఇండియా వ‌చ్చి త‌న వ్యాపారాన్ని మ‌రింత పెంచుకోవాల‌ని చూస్తే ఆయ‌న‌కు ఆత్మీయ స్వాగ‌తమే కాకుండా మ‌రెన్నో తీపి జ్ఞాప‌కాలు క‌లిగాయి! ఇండియా విజిట్‌ కు వ‌చ్చిన జుక‌ర్‌ బ‌ర్గ్‌ తాజ్ మహల్ చూసి ఔరా అన్నాడు. ఫేస్ బుక్‌ లో తాజ్‌ మ‌హ‌ల్ వ‌ద్ద దిగిన త‌న‌ ఫొటోను పోస్ట్ చేసి లక్షణంగా లక్షల్లో లైకులు కొట్టించుకున్నాడు. ఇండియా ఈజ్ గ్రేట్ అని ప్రపంచానికి ఢంకా బజాయించి మరీ చెప్పాడు. అంత వరకు బాగానే ఉంది కానీ మ‌నం ఎప్పుడూ అనుభవించే ఓ చేదు నిజాన్ని అనుభ‌వించి జుక‌ర్ బ‌ర్గ్ షాక్ తిన్నాడు.

తాజ్ మహల్ సందర్శించిన అనంతరం జుక‌ర్‌ బర్గ్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ట్రాఫిక్‌ లో ఇరుక్కుపోయాడు. కాసేపు త‌న వాహ‌నంలోనే ఉండిపోయిన‌ప్ప‌టికీ ఎంత‌కీ ట్రాఫిక్ క‌ద‌ల‌క‌పోవ‌డంతో... కార్లో నుండి కిందకు దిగి కచోరీ లు తిన్నాడట. స్థానికులతో మాట మాంతి చేశాడట. అయినా ట్రాఫిక్ కదలలేదు. దాదాపు గంట త‌ర్వాత ఆయ‌న‌కు ట్రాఫిక్‌ నుంచి విముక్తి ల‌భించింది. దీంతో హ‌మ్మ‌య్య అనుకొంటూ ఢిల్లీకి చేరుకున్నారు.

అమెరికా - లండ‌న్‌ - ఆస్ర్టేలియా స‌హా మౌళిక స‌దుపాయాల్లో టాప్ రేంజ్‌ ల్లో ఉన్న దేశాల నుంచి వచ్చిన వాళ్లు మ‌న దేశాన్ని చూసి వావ్ ఇండియా అంటారు. మన దగ్గర వింతలు చూసి - ఆ థ్రిల్‌ ను అనుభవించిన ఖుష్ అయిపోతుంటారు. అయితే విదేశీయులకు ఆతిథ్యం ఇవ్వడంలో భార‌త‌దేశం టాప్‌ లోనే ఉన్నా.. ఆతిథుల‌ను ట్రాఫిక్ బారిన పడకుండా కాపాడలేకపోతున్నాం. స్వ‌చ్ఛ‌భార‌త్ లాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మం ఏదైనా చేప‌ట్టి దేశంలో ట్రాఫిక్‌ కు చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.