Begin typing your search above and press return to search.

సైకిల్ తొక్కుతూ ఆఫీసుకొచ్చిన ప్రధాని

By:  Tupaki Desk   |   23 Aug 2018 11:24 AM GMT
సైకిల్ తొక్కుతూ ఆఫీసుకొచ్చిన ప్రధాని
X
దేశ ప్రధాని పర్యటన అంటే ఇండియాలోనైనా.. అమెరికాలోనైనా ఎంతో హడావుడి ఉంటుంది. ప్రధాని పర్యటనకు ముందే విమానాలు, హెలీక్యాప్టర్లు ట్రయల్ రన్ చేస్తాయి. ప్రధాని పర్యటించే ప్రాంతాలను హైసెక్యూరిటీ జోన్ గా ప్రకటించి అక్కడి ప్రాంతాన్ని నేషనల్ సెక్యురిటీ సిబ్బంది ఆధీనంలోకి తీసుకుంటుంది.. సీసీ టీవీలు, నిఘాలు, తనిఖీలతో హరెత్తిస్తారు.. కానీ అన్ని చోట్ల అలా ఉండదు.. తాజాగా నెదర్లాండ్ ప్రధాని సింప్లిసిటీకి కొత్త అర్థం చెప్పి అందరికీ షాకిచ్చాడు..

ఇంగ్లండ్ దేశం పక్కన ఉండే నెదర్లాండ్ దేశంలో ఆ దేశ ప్రధాని తాజాగా తన ఆఫీసుకు సైకిల్ పై సాధారణ పౌరుడిగా వచ్చాడు. దీన్ని ఫొటో తీసిన ఓ ఎంపీ ట్విట్టర్ లో షేర్ చేసి ‘మా ప్రధానమంత్రి ఆఫీసుకు వెళ్లే విధానం చూసి నేను నెదర్లాండ్ కు చెందిన వ్యక్తిగా గర్వపడుతున్నాను’ అని కామెంట్ చేశాడు. ఈ ఫొటో వైరల్ గా మారింది. ఎన్నో దేశాల ప్రధానలు హైసెక్యూరిటీ మధ్య వెళుతుంటే.. ఈ నెదర్లాండ్ ప్రధాని మాత్రం సింపుల్ గా సైకిల్ పై వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.