Begin typing your search above and press return to search.

భార్యపై బలవంతపు శృంగారంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   12 May 2022 2:21 AM GMT
భార్యపై బలవంతపు శృంగారంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
X
భార్యకు ఇష్టం లేకుండా జరిపే శృంగారాన్ని రేప్ గా పరిగణించి భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనే అంశంపై హైకోర్టు చీలిపోయింది. ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఈ అంశం విస్తృత ధర్మాసనం పరిశీలనకు వెళ్లనుంది.

భార్యకు ఇష్టం లేకుండా.. ఆమె అనుమతి లేకుండా భర్త బలవంతంగా శృంగారం జరపడాన్ని అత్యాచారంగా పరిగణించాలనే మారిట్ రేప్ (వైవాహిక అత్యాచారం) వ్యవహారంపై హైకోర్టులో ఏం తేలలేదు. వైవాహిక అత్యాచారంపై సుధీర్ఘ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. కానీ ఇద్దరు జడ్జీలు పరస్పర విరుద్ధమైన తీర్పులు వెల్లడించడంతో వ్యవహారం ఎటూ తేలలేదు. దీంతో సంబంధిత పిటీషన్లను విస్తృత ధర్మాసనం పరిశీలను వెళ్లాయి.

వైవాహిక అత్యాచారం వివాదంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే ఇద్దరు జడ్జీలు పరస్పరం విరుద్ధ తీర్పులు రాశారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం ముమ్మాటికీ నేరమేనని జస్టిస్ రాజీవ్ షక్దేహర్ తీర్పు చెప్పాడు. బెంచ్ లోని మరో జడ్జి జస్టిస్ సి హరిశంకర్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. నేరం కాదని తీర్పునిచ్చారు. భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని సెక్షన్లతో వివరించారు.

జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి హరిశంకర్ అంగీకరించలేదు. విభజన తీర్పు రావడంతో ఈ పిటీషన్ల విచారణను విస్తృతస్థాయి ధర్మాసనానికి రిఫర్ చేశారు.

వైవాహిక అత్యాచారం అనేది భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద 'రేప్' యొక్క నిర్వచనానికి మినహాయింపుగా చట్టాలు చెబుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన తన భార్యపై బలవంతంగా శృంగారం చేసిన వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి బలవంతపు అత్యాచారాలు దేశంలో బోలెడు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు నోరుమూసుకున్న మహిళలు ఇప్పుడు గొంతెత్తుతున్నారు. తమకు ఇష్టం లేనిదే శృంగారానికి ఒప్పుకోవడం లేదు. మగవాళ్లకు ముఖం మీదనే కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఏదేమైనా సమాజంలో భాగస్వాములిద్దరి వైఖరిలో క్రమంగా మార్పు వస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నారు..