Begin typing your search above and press return to search.

స్పానిష్ ఫ్లూ, కరోనా ను జయించిన 113 ఏళ్ల బామ్మ !

By:  Tupaki Desk   |   13 May 2020 5:15 AM GMT
స్పానిష్ ఫ్లూ, కరోనా ను జయించిన 113 ఏళ్ల బామ్మ !
X
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 43 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య కూడా 3 లక్షల చేరువలో ఉంది. ముఖ్యంగా కరోనాతో ఎక్కువగా చనిపోతున్నది 60 ఏళ్లు దాటిన వాళ్లే. డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేవారికి కరోనా సోకితే... వాళ్లు చనిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. అయితే , ఇలాంటి సమయంలో స్పెయిన్‌ కి చెందిన 113 బామ్మా ఈ మహమ్మారి పై పోరాటం చేసి విజయం సాధించింది.

స్పెయిన్ కి చెందిన 113 ఏళ్ల , మారియా బ్రన్యాస్ అనే బామ్మా కరోనా నుంచి కోలుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ను జయించిన వారిలో అత్యధిక వయస్కురాలిగా ఈమె రికార్డ్ సృష్టించింది. ఇటీవల డచ్‌లో 107 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. ఇప్పుడు ఆమె కంటే ఎక్కువ వయసున్న మారియా ఈ మహమ్మారి పై విజయం సాధించి ఆ రికార్డును తిరగరాసింది. మారియాకు ఏప్రిల్‌ లో ఈ వ్యాధి సోకింది. దానితో ఓ కేర్ హోంలో ఐసోలేట్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా టెస్ట్ చెయ్యగా... నెగెటివ్ వచ్చింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918-19లో విజృంభించిన స్పానిష్‌ ఫ్లూ నుంచి సైతం మారియా కోలుకోవడం విశేషం. రెండు ప్రపంచ యుద్ధాలు సహా 1936-39 మధ్య జరిగిన స్పానిష్‌ అంతర్యుద్ధాన్నీ మరియా చూశారు. గత 20ఏళ్లుగా కటోలినియా ఓలాట్ ఓల్డేజ్ హోంలో గడుపుతున్నారు. మొత్తంగా రెండు ప్రపంచ యుద్దాలు , స్వనిష్ ఫ్లూ , కరోనా వంటి అంటారా యుద్ధాలను సైతం ఆమె చవిచూసి కోలుకోవడం విశేషం.