Begin typing your search above and press return to search.
ఇంగ్లిష్ మీడియంపై బాలయ్య చిన్నల్లుడు భలే..
By: Tupaki Desk | 5 Nov 2020 8:15 AM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో జగన్ సర్కారు ఎంత పట్టుదలతో ఉందో తెలిసిందే. సరైన సన్నద్ధత లేకుండా హడావుడిగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టేయడంపై ఎవరెంతగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పైగా ఇలా అన్న వారిపై వైకాపా నాయకులు ఎదురు దాడి చేస్తున్నారు. మీ పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇంగ్లిష్ మీడియం వద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఐతే వైకాపా వాదనను తిప్పికొట్టడంలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు అనుకున్నంతగా విజయవంతం కావట్లేదన్నది వాస్తవం. ఐతే ఇప్పుడు తెదేపాలో పేరున్న నాయకుల కంటే రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేని బాలయ్య చిన్నల్లుడు భరత్.. ఈ అంశంపై స్పష్టంగా వాదన వినిపించాడు ఓ ఇంటర్వ్యూలో.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశం పెట్టడంపై భరత్‌ను ప్రశ్నిస్తే.. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత కాదనలేనిదని అతను స్పష్టం చేశాడు. ఈ రోజుల్లో వ్యాపారాలన్నీ ఇంగ్లిష్ మాధ్యమం ద్వారానే జరుగుతాయని, ఉద్యోగం తెచ్చుకోవాలన్నా ఇంగ్లిష్ తప్పనిసరి అని అతనన్నాడు. ఐతే ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 60 లక్షల మంది విద్యార్థులున్నారనుకుంటే వారికి ఇంగ్లిష్‌లో చదువు చెప్పేందుకు 2 లక్షల మంది ఇంగ్లిష్ మీద పట్టున్న ఉపాధ్యాయులు కావాలని, ఇప్పటికిప్పుడు వారినెక్కడ తెస్తారని ప్రశ్నించాడు భరత్. ప్రస్తుత ఉపాధ్యాయులకే ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది కదా అంటే.. పది పదిహేనేళ్లు ఇంగ్లిష్ మీడియం బోధనలో అనుభవం ఉంటే తప్ప ఆ భాషలో సమర్థంగా పాఠాలు చెప్పడం రాదన్నాడు భరత్.
సరిగా ఇంగ్లిష్ రాకుండా ఆ మాధ్యమంలో బోధిస్తే విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నాడు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవట్లేదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇంగ్లిష్‌లో క్వాలిఫైడ్ టీచర్లు పాఠాలు చెబితే మంచిదే అని.. అలాంటి సన్నద్ధత లేకుండా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతోనే సమస్య అని చెప్పాడు. అన్నింటికీ మించి విద్యార్థులకు అలవాటైన, మాతృభాషలో పాఠాలు చెబితే బాగా అర్థమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని అతను ప్రస్తావించాడు. పార్టీ స్టాండ్ ఎలా ఉన్నప్పటికీ ఇంగ్లిష్ మీడియం విషయంలో ఇవి తన అభిప్రాయాలని భరత్ చెప్పాడు.