Begin typing your search above and press return to search.

వనగండ్ల వానకు 21 మంది అథ్లెట్లు బలయ్యారు!

By:  Tupaki Desk   |   23 May 2021 3:03 PM IST
వనగండ్ల వానకు 21 మంది అథ్లెట్లు బలయ్యారు!
X
చైనాలో విషాదం చోటు చేసుకుంది. వనగండ్ల వానకు 21 మంది అథ్లెట్లు బలయ్యారు. మారథాన్ జరుగుతుండగా అకస్మాత్తుగా కురిసన వర్ష బీభత్సానికి ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈశాన్య చైనా హువాంగే షిలీన్ పర్వతాల సమీపంలో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామరథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మారథాన్ మొదలు పెట్టిన సమయంలో వాతావారణం పొడిగా ఉందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. అలా రేస్ ప్రారంభమైన కాసేపటికీ వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పు జరిగిందని తెలిపారు. మధ్యాహ్నం వేళ వాతావరణం చల్లబడి వడగండ్ల వాన కురిసినట్లు పేర్కొన్నారు. మారథాన్ లో పాల్గొన్న అథ్లెట్లు ఏం చేయాలో తెలియని స్థితిలో చెట్టుకొకరు, పుట్టకొకరు అన్న మాదిగా పరుగులు తీశారు. ఎక్కడ చోటు దొరికితే అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేశారు.

పక్కనే ఉన్న కొండలు, ఎల్లో స్టోన్ ఫారెస్ట్ వెంట పరుగులు తీశారు. ఆ సమయంలో చాలా మంది ఆటగాళ్లు హైపోథెర్మియాకు గురైనట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. మారథాన్ లో మొత్తం 172 మంది పాల్గొన్నారని తెలిపారు. తొలుత వంద ఆచూకీ లభించలేదు.

అనంతరం రెస్క్యూను ముమ్మరం చేయగా పలువురిని గుర్తించిటన్లు వివరించారు. ఆదివారం ఉదయం వరకు 151 మంది ఆచూకీ లభ్యమైందని పేర్కొన్నారు. వారిలో 21 మంది మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.

విపరీతమైన చలి కారణంగానే ఆ 21 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి వైద్యులు తెలిపారు. అందరూ షార్ట్స్, టీషర్ట్స్ ధరించడం వల్లే మృతి చెందారని తెలిపారు. వాతావరణం ఒక్కసారిగా చీకటిగా మారిందని బాధితుడు తెలిపారు. ఆ సమయంలో నాలుక, వేళ్లు గడ్డకట్టుకుపోయానని మీడియాకు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు మృతి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.