Begin typing your search above and press return to search.
ఆ దేశ కరెన్సీ మీద ఆ ఆటగాడి బొమ్మ?
By: Tupaki Desk | 9 Dec 2020 10:10 AM ISTఅనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది అర్జెంటీనా. ఈ దేశం పేరు విన్నంతనే గుర్తుకు వచ్చే మొదటి రెండు అంశాల్లో ఒకటి ఫుట్ బాల్ అయితే.. మరొకటి ఫుట్ బాల్ మాంత్రికుడు డిగో మారడోనా. అంతటి ప్రముఖ క్రీడాకారుడికి అసలుసిసలైన అంజలిని ఘటించేలా ఆ దేశం ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మధ్యనే మారడోనా మరణించిన సంగతి తెలిసిందే.
అతడి జ్ఞాపకార్థం దేశ కరెన్సీపై అతని బొమ్మను ముద్రించాలని అర్జెంటీనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా లా పంపా ప్రావిన్స్ సెనెటర్ నార్మాడ్యూరాంగో ప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ కు తన ప్రతిపాదనను పంపారు. 1000 ‘పెసో’ (అర్జెంటీనా కరెన్సీ పేరు. మన రూపాయిల్లో 1000 పెసో విలువ రూ.3729 ఉంటుంది) నోటు మీద మారడోనా బొమ్మను ప్రింట్ చేయాలన్న ప్రతిపాదన పంపారు.
ఈ నోటుపై ఒకవైపు మారడానో బొమ్మ.. మరోవైపు హ్యాండ్ ఆఫ్ గాడ్ నమూనాను పొందుపర్చనున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనపై చట్టసభలోని సభ్యులదే తుది నిర్ణయం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
మారడోనాను గౌరవించుకోవటంతోపాటు.. ఆర్థిక లావాదేవీల పరంగా ఆలోచించి.. ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. అర్జెంటీనాకు వచ్చే వారు తాము అమితంగా ఆరాధించే మారడోనాను తమతో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారని భావిస్తున్నారు. కరెన్సీ నోటు మీద ఆటగాడి బొమ్మ అరుదైన గుర్తింపుఅతడికే కాదు.. ఆ దేశానికి కూడా అన్న దాన్లో మరో మాటకు అవకాశం లేనట్లే.