Begin typing your search above and press return to search.

టీఆర్ ​ఎస్​ నేతను చంపేసిన మావోలు..ఉలిక్కిపడ్డ ఉత్తర తెలంగాణ

By:  Tupaki Desk   |   11 Oct 2020 10:45 AM IST
టీఆర్ ​ఎస్​ నేతను చంపేసిన మావోలు..ఉలిక్కిపడ్డ ఉత్తర తెలంగాణ
X
తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు అడుగుపెట్టారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. సరిహద్దు జిల్లాలైన కుమ్రంభీం ఆసిఫాబా, ఆదిలాబాద్​, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఇప్పటికే మావోయిస్టులు తిష్ట వేశారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు కూడా కూంబింగ్​ ఆపరేషన్​ మొదలు పెట్టారు. ఏకంగా డీజీపీ మహేందర్​రెడ్డి అనుమానాస్పద ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ఇప్పడు జరిగిన ఓ ఘటన మాత్రం యావత్​ తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి అధికారిక పార్టీకి చెందిన ఓ నేతను మావోయిస్టులు పొట్టన పెట్టకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత మాడురి భీమేశ్వర్ రావును శనివారం అర్ధరాత్రి మావోయిస్టులు హత్యచేశారు. ఇంట్లో నిద్రిస్తున్న భీమేశ్వర్ రావును విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటనతో ఉత్తర తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఘటనా స్థలంలో వారు లేఖ వదిలి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘భీమేశ్వర్​రావు అధికార పార్టీలో కొనసాగుతూ అరాచకాలు చేస్తున్నాడు. పేద ప్రజలను దోచుకుంటున్నాడు. అందుకే అతడిని హతమార్చాం. ఇంకా మా హిట్​లిస్ట్​లో చాలామంది ఉన్నారు. టీఆర్​ఎస్​, బీజేపీ నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే భీమేశ్వర్​కు పట్టిన గతే వాళ్లకు పడుతుంది’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. రానున్న రోజుల్లో పోలీసులు కుంబింగ్​ను మరింత తీవ్రతరం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటవీప్రాంతాలన్నీ జల్లెడ పడతారని సమాచారం.