Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ కు గులాబీ పార్టీపై పగ పక్కానంట

By:  Tupaki Desk   |   21 Sept 2015 3:10 PM IST
ఎన్ కౌంటర్ కు గులాబీ పార్టీపై పగ పక్కానంట
X
వరంగల్ జిల్లా అడవిలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ వ్యవహారం మావోలలో తీవ్ర ఆగ్రహానికి రేకెత్తించినట్లు తెలుస్తోంది. తాజాగా మావోలకు చెందిన ఖమ్మం.. కరీంనగర్.. వరంగల్ జిల్లాల కార్యదర్శి దామోదర్ ఒక హెచ్చరిక లేఖను కొన్ని మీడియా సంస్థలకు పంపారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు శృతి.. విద్యాసాగర్ రెడ్డిలు మృతి చెందటం తెలిసిందే.

తాజా లేఖలో మావోల ఆరోపణ ఏమిటంటే.. తమ వారిపై కాల్పులు జరిపలేదని.. బంధించి.. అత్యంత దుర్మార్గంగా చంపారని వారు ఆరోపిస్తున్నారు. తాగునీటి కోసం దారి తప్పిన తమ వారిని పట్టుకొని హింసించి చంపారని.. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులను.. తెలంగాణ అధికారపక్షాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ అని చెబుతున్నా అది బూటకపు ఎన్ కౌంటర్ అని.. ఎప్పటికైనా వారి మృతికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

అధికారంలోకి వస్తే.. మావోల ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్.. మావోల నిర్మూలనే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. త్వరలో ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. తాజా హెచ్చరికలపై పోలీసు.. అధికారపక్షంలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు.