Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్యే ను కాల్చి చంపిన మావోయిస్ట్ లొంగుబాటు
By: Tupaki Desk | 13 Feb 2020 1:15 PM IST2018 సెప్టెంబర్ 24వ తేదీన అరకు లోయ నియోజకవర్గం డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దెస వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ని మావోయిస్టులు ముందే చెప్పి మరీ చంపేయడం పెద్ద వివాదానికి దారితీసింది. అయన తన వ్యక్తిగత పనుల మీద వెళ్తున్న సమయం లో మావోయిస్టులు అకస్మాత్తుగా అటాక్ చేసి , అక్కడిక్కడే చంపేశారు. ఇకపోతే , ఈ దారుణ హత్యోదంతంలో ప్రధాన పాత్ర పోషించిన టాప్ మావోయిస్టు లీడర్ తాజాగా పోలీసులకి లొంగి పోయారు.
ఆ మావోయిస్టు పేరు జిప్రో హబీకా. అయన వయస్సు 30 సంవత్సరాలు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ స్వగ్రామం. తల్లిదండ్రులు బాలీ హబీకా, అర్షా అబికా వ్యవసాయదారులు. జిప్రో హబీకా 2012లో మావోయిస్టు దళంలో చేరారు. ఆ తరువాత మెల్లిమెల్లిగా మావోయిస్ట్ గ్రూప్ లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. 2014-15లో కోరాపుట్ జిల్లాలోని పొట్టంగి, ఛత్తీస్‌గఢ్ లోని ఇంద్రబస్తీ అడవుల్లో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్‌లల్లో జిప్రో హబీకా ప్రత్యక్షంగా పాల్గొనట్టు పోలిసుల వద్ద సమాచారం ఉంది. అలాగే 2016లో పొట్టంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుటేరులో సర్పంచ్ జీ సుందర్ రావును కాల్చి చంపారు. పలు వాహనాలను తగులబెట్టిన ఘటనలకు హబీకా నాయకత్వాన్ని వహించినట్లు కోరాపుట్ పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలోనే ఒడిశా ప్రభుత్వం ఆయన పై నాలుగు లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది.
ఆ తరువాత 2018 లో టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమలను కాల్చి చంపిన ఘటనలో కీలకపాత్ర వహించారు. 2019లో కోరాపుట్ జిల్లా పడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిట్వా వద్ద చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ కు సారథ్యాన్ని వహించారు. కానీ , తాజాగా- జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే నిర్ణయంతో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టు గ్రూపుల్లో ప్రాంతీయ భావాలు తలెత్తాయని, దాని పట్ల విసిగిపోయిన జిప్రో హబీకా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని నిర్ణయించుకున్నట్లు మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన లొంగుబాటు ఫలితంగా మావోయిస్టులకు పెట్టని కోటగా భావిస్తూ వస్తోన్న ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏఓబీ) దళం బలహీన పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.