Begin typing your search above and press return to search.

భారీ ఎన్ కౌంట‌ర్ కు రివైంజ్ షురూ?

By:  Tupaki Desk   |   6 March 2018 4:46 AM GMT
భారీ ఎన్ కౌంట‌ర్ కు రివైంజ్ షురూ?
X
గ‌డిచిన కొంత‌కాలంగా మావోల విష‌యం పెద్ద‌గా లేని వేళ‌.. ఇటీవ‌ల చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంట‌ర్ అంద‌రిని ఉలిక్కిప‌డేలా చేసింది. క్ర‌మ‌క్ర‌మంగా ఉనికిని కోల్పోతున్న మావోల మీద ఆయువు ప‌ట్టుకు దెబ్బ ప‌డేలా తాజా ఎన్ కౌంట‌ర్ ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

త‌మ‌ను తీవ్రంగా దెబ్బ తీసిన ఎన్ కౌంట‌ర్ మీద మావోలు య‌మా సీరియ‌స్ గా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో తెలంగాణ నేత‌లు ఎవ‌రూ భ‌ద్ర‌త లేకుండా తిర‌గొద్ద‌ని.. జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ పోలీసులు.. నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్న వైనం తెలిసిందే. ఒక విశ్వాస‌ఘాత‌కుడి కార‌ణంగా దారుణ‌మైన న‌ష్టాన్ని తాము చ‌వి చూడాల్సి వ‌చ్చింద‌ని.. అంత‌కంత‌కూ బ‌దులు తీర్చుకుంటామ‌ని మావోలు వార్నింగ్ ఇవ్వ‌టం తెలిసిందే.

తమ‌వి ఉత్త మాట‌లు కావ‌ని.. చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య త‌ప్ప‌క తీర్చుకుంటామ‌న్న‌ట్లుగా మావోలు ప్రతీకార చ‌ర్య‌ల‌కు దిగుతున‌నారు. మొన్న‌టికి మొన్న పోలీసుల‌కు వేగుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న అనుమానంతో చంపేసిన మావోలు.. తాజాగా హైద‌రాబాద్ డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బ‌స్సును.. మ‌రో ప్రైవేటు బ‌స్సును ద‌గ్థం చేశారు. హైద‌రాబాద్ నుంచి ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలోని జ‌గ్ద‌ల్ పూర్ కు వెళుతున్న ఆర్టీసీ బ‌స్సును సుకుమా జిల్లా దోర్న‌పాల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కుర్తె గ్రామ స‌మీపంలో నిలిపివేశారు.

అనంత‌రం ప్ర‌యాణికులంద‌రిని కింద‌కు దించేశారు. ఆపై బ‌స్సు డీజిల్ ట్యాంక్ ను ప‌గ‌ల‌గొట్టి ఆయిల్ ను బ‌స్సులో చ‌ల్లి నిప్పు అంటించారు. ఇదే దారిలో వెళుతున్న మ‌రో ప్రైవేటు బ‌స్సు.. టిప్ప‌రు.. ట్రాక్ట‌ర్ ను త‌గ‌ల‌బెట్టేశారు. అంద‌రూ చూస్తుండ‌గానే ఒక‌రిని కాల్చి చంపారు. అయితే.. అత‌డు కానిస్టేబుల్ గా భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు సిబ్బంది.. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌లేద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మావోలు ప్ర‌తీకార ధోర‌ణిలో ఉన్నార‌ని.. తెలంగాణ ప్రాంతానికి చెందిన‌ప్ర‌జ‌ప్ర‌తినిధులంతా హైద‌రాబాద్ కు బ‌యలుదేరిన‌ట్లుగా చెబుతున్నారు.

ముఖ్యంగా ఖ‌మ్మం.. భూపాల్ ప‌ల్లి.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల‌కు చెందిన తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు పోలీసు శాఖ‌కు ముంద‌స్తు స‌మాచారం ఇచ్చి మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లాల‌న్న సూచ‌న‌లు చేస్తున్నారు.