Begin typing your search above and press return to search.
కొత్త రూల్ తో కాంగ్రెస్ లో చాలా మందికి మూడింది
By: Tupaki Desk | 9 Oct 2022 11:18 AM ISTకాంగ్రెస్ పార్టీ కూడా యువ మంత్రమే జపిస్తోంది. అమరావతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు 50 ఏళ్ళలోపు వారికే కేటాయించబోతున్నట్లు చెప్పారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శశిథరూర్, ఖర్గే తమ మ్యానిఫెస్టోలను ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రచారానికి వచ్చిన థరూర్ కు తెలుగు రాష్ట్రాల్లో నేతలు పెద్దగా స్పందించలేదు.
అంటే నేతల సహాయ నిరాకరణతో థరూర్ దాదాపు ఒంటరిగానే పర్యటించి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో ఖర్గే పర్యటన మొదలవ్వగానే నేతల్లో అత్యధికులు సాయంగా నిలబడ్డారు. దీంతోనే గెలుపు ఎవరిదనే విషయంలో అందరికీ దాదాపు ఒక క్లారిటి వచ్చేసింది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఖర్గే కూడా యువమంత్రం పఠించటం గమనార్హం. మామూలుగా అయితే 50 ఏళ్ళ వయసంటే మధ్య వయసనే చెప్పాలి.
కానీ రాజకీయాల్లో మాత్రం 50 ఏళ్ళంటే యువకుల కిందే లెక్క. అందుకనే ఖర్గే 50 ఏళ్ళలోపు వాళ్ళకి 50 శాతం టికెట్లని ప్రకటించారు. అయితే ఖర్గే చేసిన ప్రకటన ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుందనేది అనుమానమే. ఎందుకంటే ఒక మనిషికి ఒకటే పదవని ఈమధ్యనే రాజస్ధాన్లోని ఉదయ్ పూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరిలో నిర్ణయించారు. దీని ప్రకారం పార్టీ అద్యక్షపదవికి పోటీచేయాలని అనుకున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విషయంలో ఎంత గొడవైందో అందరు చూసిందే.
తనకు మూడు పదవులు నిర్వహించే సామర్ధ్యం ఉందకాబట్టి తాను ప్రెసిడెంట్ పదవితో పాటు సీఎంగా కూడా కంటిన్యు అవుతానని మొండికేసి కూర్చున్నారు. తర్వాత జరిగిన పరిణామాల వల్ల అధ్యక్ష పోటీనుండి తప్పుకున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే పార్టీలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టమైపోతుంది. ఇపుడు ఖర్గే ప్రకటనను కూడా మనం ఇలాగే చూడాల్సుంటుంది. సరే ఆ సమయం వచ్చినపుడు చూడాలి ఏమవుతుందో.