Begin typing your search above and press return to search.

కరోనా వేళ అంతమంది ‘ఒంటరితనాన్ని’ అనుభవించారట

By:  Tupaki Desk   |   22 March 2021 6:00 PM IST
కరోనా వేళ అంతమంది ‘ఒంటరితనాన్ని’ అనుభవించారట
X
కరోనా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. దాని కారణంగా ఆర్థికంగానే కాదు.. మానసికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులకు కారణమైన కరోనా పుణ్యమా అని దేశంలో ఒంటరితనం బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందన్న విషయం తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే.. ఈ బాధితుల్లో అత్యధికులు నగరాల్లో జీవించే వారే కావటం గమనార్హం.

నగరాల్లో జీవించే ప్రతి పది మంది భారతీయుల్లో నలుగురు ఒంటరితనాన్ని అనుభవించినట్లు ఇప్సోస్ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. నిత్యం నలుగురితో మాట్లాడటం.. ఇంటా బయటా స్నేహితులతో కాలం గడిపే వారికి.. లాక్ డౌన్ సరికొత్త ఒంటరితనాన్ని పరిచయం చేసిందని.. బలవంతంగా ఏకాంత సమయాన్ని గడిపేలా చేసిందని పేర్కొన్నారు.

కొందరు ఈ ఒంటరితనాన్ని తరిమేయటం కోసం ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తే.. మరికొందరు ఆన్ లైన్ లో బంధువులతో మాట్లాడారని.. ఇంకొందరు గేములు ఆడారని.. సోషల్ మీడియా.. ఓటీటీ ఇలా ఎంగేజ్ అయ్యే ప్రయత్నం చేసినట్లు పేర్కొంది. మరికొందరైతే ఇంట్లో వారితో సరదాగా గడిపినట్లుగా గుర్తించారు. ఇలాంటి వారుఇంట్లోని వారి ఇష్టాలను తెలుసుకొని.. వారికి సాయం చేసే ప్రయత్నం చేశారని తెలిపింది.

కరోనా వేళ పట్టణ ప్రాంతాల్లోని ఇరుగుపొరుగున ఉండే వారి నుంచి అన్ని రకాలుగా మద్దతు లభించిందని 50 శాతం మంది చెప్పగా.. సౌదీలో ఇది 51 శాతం.. చైనాలో 55 శాతం ఉన్నట్లుగా తేలింది. రష్యాలో 13 శాతం.. జపాన్ లో 10 శాతమే ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది.