Begin typing your search above and press return to search.

తీసేసే మంత్రుల్లో ఫ‌స్ట్ పేర్లు చాలానే ఉన్నాయా...?

By:  Tupaki Desk   |   18 Nov 2021 2:30 AM GMT
తీసేసే మంత్రుల్లో ఫ‌స్ట్ పేర్లు చాలానే ఉన్నాయా...?
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. త‌న మంత్రివ‌ర్గాన్ని త్వ‌ర‌లోనే ప్రక్షాళ‌న చేయ‌నున్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత .. ఏర్పాటు చేసుకున్న మంత్రివ‌ర్గాన్ని రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. 90 శాతం మేర‌కు మార్చుతాన‌ని చెప్పుకొ చ్చారు. ఈ ప్ర‌కారం.. ఈ నెల 30తో జ‌గ‌న్ స‌ర్కారుకు రెండున్న‌రేళ్లు పూర్త‌వుతాయి. దీంతో ఆయ‌న త‌న మంత్రివ‌ర్గాన్ని మార్చ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే దీనికి సంబంధించి.. అనేక సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. చాలా మంది మంత్రులు.. త‌మ ప‌ద‌వులు పోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు సైతం చేస్తున్నా రు. అంతేకాదు.. జ‌గ‌న్ ఎలాంటి బాధ్య‌త‌లు ఇచ్చినా. చేస్తామ‌ని కూడా చెబుతున్నారు.

అయితే.. ఈ మంత్రివ‌ర్గం మార్పు కూర్పుల‌పైనా.. అనే సందేహాలు ఉన్నాయి. అత్యంత సీనియ‌ర్లు.. ప్ర‌భుత్వాన్ని అన్ని విధాలా ముందుండి న‌డిపిస్తున్న వారు ఉన్నారు. సో.. ఈ స‌మ‌యంలో అలాంటి వారి ని ఎలా మారుస్తారు? అంటూ..కొంద‌రి పేర్ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. అంటే.. వీరిని.. మార్చ‌లేని ప‌రిస్థితి ఉంద నేది.. వారి ఉద్దేశం. అదేస‌మ‌యంలో కొంద‌రి పేరు కూడా ప్ర‌ముఖంగానే వినిపిస్తున్నాయి.

అవి.. మంత్రి వ‌ర్గంలో తీసేసే ఫ‌స్ట్ పేర్లు అంటూ.. హ‌డావుడి చేస్తున్నారు. మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల్సి వ‌స్తే.. త‌క్ష‌ణం వీరిని తీసేస్తార‌ని.. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వారి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

ఇలాంటివారిలో దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లిశ్రీనివాస్ పేరు ముందుంది. అదేవిధంగా.. ఈయ‌నకన్నా ముందు.. అనంత‌పురానికి చెందిన‌.. కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం పేరు, అదేవిధంగా అమ‌లాపురానికి చెందిన పినిపే విశ్వ‌రూప్‌, ప‌శ్చిమ‌కు చెందిన మ‌హిళా మంత్రి తానేటి వ‌నిత‌, ఇదే జిల్లాకు చెందిన రంగ‌నాథ‌రాజు.. వంటివారి పేర్లు ముందు వ‌రుస‌లో ఉన్నాయి.

వీరిని ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన‌సాగ‌నిచ్చే అవ‌కాశం లేద‌ని.. వైసీపీలో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వీరిపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని కూడా అంటున్నారు. కొంద‌రు మంత్రులు.. రెండు చేతుల‌తో సంపాదించుకుంటున్నార‌ని.. వైసీపీలోనే చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో వీరిని ముందుగానే తీసేసే అవ‌కాశం కూడా ఉంద‌ని చెబుతున్నారు.