Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో 22వేల కోట్ల ఖర్చుతో మిలటరీ విమానం తయారీ
By: Tupaki Desk | 23 Sept 2021 8:00 AM ISTఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విమానయాన రంగ పరిశ్రమలకు హబ్ గా మారింది. బోయింగ్ 737 విడిభాగాల తయారీ హైదరాబాద్ లో జరుగనుంది. సైనిక రవాణా విమానాల ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న టాటా-ఎయిర్ బస్ ల ప్రతిపాదనలు ఆమోదం పొందితే వాటి తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారవచ్చని భావిస్తున్నారు.
దేశంలో అతిపెద్ద మిలటరీ ఆర్డర్ ను ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీకి కేంద్రం అప్పగించనుంది. ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే కాంట్రాక్ట్ ను ఇచ్చింది. ఈ భారీ డీల్ కు టాటా-ఎయిర్ బస్ గురువారం సంతకం చేసే అవకాశాలున్నాయి. రెండు వారాల తర్వాత సెక్యూరిటీ విషయంపై జరిగే కేబినెట్ కమిటీలో దీనిని ప్రవేశపెడుతారు. డిఫెన్స్ మినిస్ట్రీతోపాటు టాటా, ఎయిర్ బస్ కు చెందిన ఉన్నతస్థాయి అధికారులు ఇందులో పాల్గొంటారు.
ఈ ప్లాంట్ తయారీని దేశంలోనే చేయాలని.. హైదరాబాద్ ఈ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ కాకుంటే బెంగళూరు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లను పరిశీలిస్తున్నారు.
ఎయిర్ ఫోర్స్ కోసం ట్రాన్స్ పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ కాంట్రాక్టును టాటా-ఎయిర్ బస్ దక్కించుకుంది. ఈ మేరకు గురువారం నాటికి తయారీ ప్లాంట్ గురించి కన్ఫమ్ చేసి సంతకం చేయనున్నారు. డిఫెన్స్ తయారీ రంగంలో ప్రైవేట్ సెక్టార్ ను ప్రోత్సహించేందుకు గాను దాదాపు 22వేల కోట్లు వెచ్చించనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లోని ఆదిభట్లలో బోయింగ్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్, సంయుక్త కంపెనీ అయిన టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్ లో ఉత్పత్తి నడుస్తోంది. ఇక్కడ అపాచీ హెలిక్యాప్టర్ , విమానాల విడిభాగాలు తయారు చేస్తున్నారు. బోయింగ్ ఇండియాలో దాదాపు 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన విడిభాగాలను మన దేశం నుంచి బోయింగ్ సమీకరిస్తోంది.