Begin typing your search above and press return to search.
అప్పడు మీరు కోచ్‌గా ఉంటే నా జీవితం మరోలా ఉండేది.. తివారి
By: Tupaki Desk | 30 Oct 2020 4:20 PM ISTముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కు టీమిండియాలో చోటు దక్కకపోవడంతో బీసీసీఐపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. సూర్యాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆకాశ్ చోప్రా పలువురు మాజీలు అతడికి సపోర్ట్ చేశారు. బీసీసీఐ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేశాక బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 79 పరుగులు సాధించి జట్టు విజయానికి కృషి చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవడంతోనే ఇలా కసిగా ఆడాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి సూర్యకుమార్‌ను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర పోస్టు చేశాడు.
సూర్య నమస్కారం.. అంటూ చేతులు జోడించిన ఓ ఎమోజీని పోస్టు చేశారు. 'సూర్య నమస్కార్. ధైర్యంగా, కాస్త ఓపికగా ఉండు' అంటూ కామెంట్ చేశారు. రవిశాస్త్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ సందేశం సూర్యకుమార్‌ను సంతోష పెడుతుందని టీమిండియా వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి ఆశాభావం వ్యక్తం చేశాడు. 'నేను సెంచరీ చేసిన సిరీస్‌లో మీరు భారత జట్టు కోచ్‌గా ఉండాల్సి ఉంది. మీ నుంచి ఇలాంటి సందేశం వస్తే.. కచ్చితంగా నా అంతర్జాతీయ కెరీర్‌కు ఎంతో దోహదపడేది. మీ నుంచి ఈ ట్వీట్ రావడం చూసి సూర్యకుమార్ యాదవ్ సంతోషిస్తాడు' అని తివారి రీట్వీట్ చేశాడు. 2011 విండీస్-భారత పర్యటన సందర్భంగా ఐదో వన్డేలో తివారి శతకంతో మెరిశాడు. ఈ సిరీస్‌ను ఉద్దేశించే తివారి ట్వీట్ చేశాడు. ఆ సెంచరీ తర్వాత కూడా తివారికి జట్టులో స్థానం దక్కలేదు. ఆపై కూడా ఈ వెటరన్ క్రికెటర్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోవడంతో దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.