Begin typing your search above and press return to search.

టీ బీజేపీ నేతలకు పారికర్ షాక్

By:  Tupaki Desk   |   18 Jun 2016 4:48 AM GMT
టీ బీజేపీ నేతలకు పారికర్ షాక్
X
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్ పర్యటన తెలంగాణ బీజేపీ నేతలకు షాకిచ్చింది. ఆయన వైఖరిపై కమలనాథులు అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు.. ఆయనలా చేస్తున్నారేంటన్న చర్చ పెద్ద ఎత్తున సాగటం గమనార్హం. హైదరాబాద్ లో టూర్ పెట్టుకున్న పారీకర్.. తన పర్యటనకు సంబంధించిన వివరాల్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపకపోవటం ఏమిటన్న ప్రశ్నను కమలనాథులు సంధిస్తున్నారు.

తన హైదరాబాద్ ట్రిప్ వివరాల్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి పంపని పారీకర్.. లంచ్ మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో చేసేందుకు రెఢీ కావటం వారికి అస్సలు మింగుడుపడలేదు. ఓవైపు కేంద్రం తీరుపై తెలంగాణ సర్కారు విమర్శలు చేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి ఇంట్లో లంచ్ చేయటానికి పారికర్ రెఢీ అయిపోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఒక రోజు ముందుగానే తన పర్యటన వివరాల్ని పంపిన పారీకర్ పార్టీని అస్సలు పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఇదంతా పారీకర్ కావాలని చేసింది కాదని.. అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఇలాంటిది చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. తమ లోపలి అసంతృప్తిని దాచుకోని తెలంగాణ బీజేపీ నాయకత్వం తమ ఫీలింగ్స్ ను పారికర్ కు తెలియజేయటం.. ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని తన షెడ్యూల్ ను మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నారు.