Begin typing your search above and press return to search.
కెప్టెన్సీ వివాదం సరే.. డీల్ చేసిన విధానమే తప్పు
By: Tupaki Desk | 22 Dec 2021 10:00 PM ISTఇటీవల టీమిండియా వన్డే , టి 20 కెప్టెన్సీ ఎంతటి వివాదానికి దారితీసిందో అందరికీ తెలిసిందే. కోహ్లి టి20 కెప్టెన్సీ వదులుకుంటానని అనడం, సెలక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడం.. ఈ తప్పించే విషయాన్ని తనకు టెస్టు జట్టు ఎంపికకు గంటన్నర ముందు మాత్రమే చెప్పారని కోహ్లి వాపోవడం.. లేదులేదు.. టి20 పగ్గాలు వదిలేసినప్పుడే వన్డే సారథ్యమూ వదులుకోవాలని చెప్పామని సెలక్టర్లు అన్నట్లు పెద్ద సంచలనమైంది.
ఆ వెంటనే గాయంతో టెస్టు జట్టుకు రోహిత్ శర్మ దూరం కావడం.. కుమార్తె పుట్టిన రోజు వేడుకలని చెప్పి వన్డే సిరీస్ కు కో్హ్లి దూరంగా ఉంటాడని వదంతులు రేగడం దుమారానికి దారితీసింది. చివరకు రోహిత్ తో విభేదాలు లేవని కోహ్లి చెప్పడం, వన్డే సిరీస్ ఆడబోతున్నట్లు తెలపడంతో అంతా సద్దుమణిగింది.
ఈ మొత్తం వ్యవహారంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాత్ర ఏమిటనే సందేహాలూ వచ్చాయి. గంగూలీ మార్క్ రాజకీయం సాగిందా.? అన్న అనుమానాలూ వచ్చాయి. తాజాగా మాజీ సెలక్టర్ కీర్తి ఆజాద్ ఆ వివాదాన్ని సున్నితంగా డీల్ చేయాల్సిందని, అనవసరంగా రాద్ధాంతం చేశారని గంగూలీని ఉద్దేశించి అన్నాడు.
టీమిండియా చరిత్రలోనే అపఖ్యాతిని మూటగట్టుకున్న విషయం గంగూలీ-చాపెల్ మధ్య వివాదం చెలరేగినప్పుడు సెలెక్టర్, అప్పటి భారత కెప్టెన్‌ను కెప్టెన్సీ నుంచి వైదొలగమని అడిగారు. ప్రస్తుతం కోహ్లితో జరిగిన దాని మాదిరిగానే అప్పుడూ జరిగందంటూ బాంబ్ పేల్చాడు.
ఈ నిర్ణయంతో ఆజాద్‌కు ఎలాంటి సమస్యలు లేకపోయినా, బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ, కోహ్లీకి కొంచెం మెరుగ్గా తెలియజేసే సమయాన్నిపరిష్కరించాల్సి ఉంటుందని అతను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. “బిషన్ సింగ్ బేడీని, సునీల్ గవాస్కర్‌ను ఎలా గద్దె దించారో నాకు గుర్తుంది. వెంకటరాఘవన్ తన ఫ్లైట్‌లో ఉన్నాడు. అతను విమానం నుంచి దిగగానే కెప్టెన్ అయ్యాడు. కనీసం సౌరవ్ తన అనుభవం
ద్వారా ఈ విషయం గ్రహించి ఉండాల్సింది” అని ఆజాద్ అన్నారు.
నాడు సెలక్టర్ గా ఆజాద్
2005లో టీమిండియా కెప్టెన్ గా గంగూలీని తొలగించిన సమయంలో కోచ్ చాపెల్ కాగా.. కీర్తి ఆజాద్ సెలక్టర్ గా ఉన్నారు . దీన్ని గుర్తుచేస్తూ ఆజాద్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. “గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్నప్పుడు, గంగూలీని కెప్టెన్‌గా తొలగించారు. నేను అతనిని సమర్థించానని నాకు గుర్తుంది.
అతను తన స్వీయ అనుభవం నుంచి నేర్చుకుని విరాట్‌తో చాలా ముందుగానే మాట్లాడి ఉండాలి. నేను విరాట్‌ని ప్రత్యేకమైన విషయంగా పేర్కొనడం లేదు. కానీ, కోహ్లీ మాత్రం ప్రత్యేకమైనవాడు”అని ఆజాద్ పేర్కొన్నాడు. గంగూలీ పరిస్థితిని ప్రజల్లోకి రాకుండానే మెరుగ్గా పరిష్కరించాల్సిదని ఆజాద్ అంటున్నాడు.
ముఖ్యంగా భారత శిబిరంలో చీలిక వచ్చే అవకాశం గురించి మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేసిన తర్వాత అయినా ఈ పని చేయాల్సిందని పేర్కొంటున్నాడు. కాగా, వన్డే సిరీస్‌కు కోహ్లీ, టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండరు’ అంటూ అజారుద్దీన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే విరామం తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేదు. కానీ, సమయం మెరుగ్గా ఉండాలి.
ఇది చీలిక గురించి ఊహాగానాలను రుజువు చేస్తుంది’అని అజారుద్దీన్ ట్వీట్ చేశారు.కాగా, “ఇది మరింత సరైన పద్ధతిలో జరగాలని నేను భావిస్తున్నాను. సౌరవ్ నాయకత్వంలో బీసీసీఐ కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండాలి. ప్రత్యేకించి ఒక మాజీ కెప్టెన్ ఒక చీలిక గురించి ట్వీట్ చేసినప్పుడు, ఊహాగానాలు ప్రజల్లోకి రాకూడదని, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ముందుగానే సమాచారం అందించి ఉండాల్సిందని’కీర్తి ఆజాద్ సూచించారు.