Begin typing your search above and press return to search.

సిక్కు అల్లర్ల కి పీవీ నే కారణం ... మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:57 AM GMT
సిక్కు అల్లర్ల కి పీవీ నే కారణం ... మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు !
X
భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 1984లో ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపిన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా సిక్కుల ఊచకోత జరిగింది. దీనితో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ దారుణమైన పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. ఆ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు ఐ.కె.గుజ్రాల్ చెప్పిన మాటలను నాడు హోంమంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావు పెడచెవిన పెట్టడం వల్లే పరిస్థితి మరింత చేజారిందని , సిక్కు అల్లర్లు జరిగి దాదాపు మూడున్నర దశాబ్దాల అనంతరం ఐకే గుజ్రాల్ శత జయంతి సందర్భంగా ఆ అల్లర్ల పై మాజీ ప్రధాని మన్మోహన్ సంచనల వ్యాఖ్యలు చేసారు.

ఐకే గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు.అల్లర్లు జరిగిన సందర్భం తనకు ఇప్పటి కీ గుర్తేనని చెప్పారు. ఇదే సందర్భంలో ఆ అల్లర్ల గురించి మాట్లాడుతూ ..ఆ అల్లర్లు జరిగిన రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోం మంత్రి పీవీకి సూచించారని, కానీ పీవీ ఆయన సలహాను సానుకూలంగా తీసుకోలేదు. ఎటువంటి ఆదేశాలు ఇవ్వ లేదు అని తెలిపాడు. ఒకవేళ ఆ నాడు గుజ్రాల్ సూచన పాటించి ఉంటే ఆరోజు అంతటి దురదృష్టకర పరిణామాలు జరిగి ఉండేవి కావు అని ఆనాటి రోజులని ఒకసారి గుర్తు చేసుకున్నారు.

ఈ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జై శంకర్ తదితరులు పాల్గొన్నారు.