Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఏఐసీసీ అధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్?

By:  Tupaki Desk   |   24 Aug 2020 1:20 PM IST
బ్రేకింగ్ : ఏఐసీసీ అధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్?
X
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు.

ఇకపోతే , ప్రస్తుతం కరోనా కాలంలో దేశం ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షభాన్ని ఎదుర్కొంటుంది. ప్రధానిగా మోడీ ఫెయిల్ అయ్యారని , ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మళ్లీ మన్మోహన్ రావాలని. దేశానికీ మన్మోహన్ సేవలు చాలా అవసరం అని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు మరోసారి ఏఐసీసీ అధ్యక్ష పదవిని మన్మోహన్ సింగ్ కి ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే , ఈ పదవిని మన్మోహన్ స్వీకరిస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం మన్మోహన్ సింగ్ వైపే మొగ్గుచూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సంచారం.