Begin typing your search above and press return to search.

మోదీకి సలహాలు ఇచ్చిన మాజీ ప్రధానమంత్రి

By:  Tupaki Desk   |   7 March 2020 9:15 AM GMT
మోదీకి సలహాలు ఇచ్చిన మాజీ ప్రధానమంత్రి
X
దేశంలో సామాజిక వైషమ్యాలు, ఆర్థిక మందగమనం, కరోనా వైరస్‌ తదితర దాడి చేసి ప్రజా జీవనం అస్తవ్యస్తంగా చేస్తున్నాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై తాజాగా స్పందించారు. అయితే మీడియా ముఖంగా కాకుండా ఓ పత్రిక కు వ్యాసం రాసి అందులో తన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కొన్ని సూచనలు చేస్తూనే పరిష్కార మార్గాలు చెప్పారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ తన అనుభవాన్ని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను గాడీన పెట్టేందుకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.

దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోదీకి త్రిసూత్ర పథకం సూచించారు. సామాజిక వైషమ్యాలు, ఆర్థిక మందగమనం, కరోనా వైరస్‌ నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ మాటలకు పరిమితం కాకుండా సరైన విధాన నిర్ణయాలతో భారత్‌ను ఆ ముప్పు నుంచి రక్షించాలని ఆ వ్యాసంలో కోరారు. ఢిల్లీలో తలెత్తిన మత ఘర్షణలను నివారించి ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సామాజిక సామరస్య వాతావరణానికి పౌరసత్వ సవరణ చట్టం ముప్పుగా పరిణమించిందని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేయడమో లేదా, నిబంధనలను సవరించడం చేయాలని సూచించారు. జాతి ఐక్యతకు మార్గం సుగమం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అదే విధంగా కొవిడ్‌-19 నివారణసై స్పందించి చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ద్రవ్య ఉద్దీపన పథకాలను తేవాలని ఈ సందర్భం గా మన్మోహన్ సింగ్ కోరారు. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో పెనుమార్పుల వలన వాహన, జౌళి పరిశ్రమలకు గిరాకీ గణనీయంగా తగ్గిందని, భారత ఎగుమతులపై ప్రతికూల వాతావరణం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహన రంగంలో వేలాదిమంది ఉద్యోగాల్ని కోల్పోయారని, పలు రంగాల్లో భారతదేశం ప్రపంచ లీడర్‌గా ఎదుగుతుండ గా, ఈ ప్రతికూల వాతావరణం ఒక్కసారిగా దెబ్బతీసిందని వ్యాసంలో ప్రస్తావించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు విధానాలతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం ఏర్పడిందని, ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఏర్పడిందని తెలిపారు. దీంతో ఆ రెండు దేశాలు పతనమవడంతో దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీదపడిందని వివరించారు. భారత ఆర్థిక మంత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ కాస్త నెమ్మదిగానే కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.